ఉప్పల్ - ఘట్​కేసర్​ ఫై ఓవర్ ​పనులను 18 నెలల్లో పూర్తి చేస్తాం : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ఉప్పల్ - ఘట్​కేసర్​ ఫై ఓవర్ ​పనులను 18 నెలల్లో పూర్తి చేస్తాం : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
  • మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి

మేడిపల్లి, వెలుగు : ఉప్పల్ – ఘట్​కేసర్ ఫ్లైఓవర్ పనులను18 నెలల్లో పూర్తిచేసి బోడుప్పల్ ప్రజల ట్రాఫిక్ కష్టాలు తొలగిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బోడుప్పల్ కేశవనగర్ కాలనీలో బుధవారం నిర్వహించిన శ్రీఅన్నపూర్ణాదేవి సహిత విశ్వనాథస్వామి విగ్రహ ప్రతిష్టాపనలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఆలయాన్ని నిర్మించిన ధర్మకర్తలకు, కాలనీవాసులకు అభినందనలు తెలిపారు. 

రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో, పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని అన్నపూర్ణా సహిత విశ్వనాథ స్వామిని ప్రార్థించానని చెప్పారు. హైదరాబాద్​లో నిరుపేదలకు ఇల్లు కట్టించి దశాబ్దం అయిందన్నారు. ప్రజా ప్రభుత్వంలో ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు అందిస్తామన్నారు. ప్రభుత్వ ప్రయత్నానికి కాశీ విశ్వనాథుని ఆశీస్సులు ఉండాలని వేడుకున్నారు.