- రూ.లక్షల్లో ఆస్తి నష్టం
ఉప్పల్, వెలుగు: ఉప్పల్ భగాయత్ శిల్పారామం సమీపంలోని మూర్తి కంఫర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఆదివారం అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి పత్తి, ఫోంకు సంబంధించిన పరుపులు, ఇతర సాఫ్ట్ వస్తువులు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజిన్లతో ఘటనాస్థలానికి చేరుకొని మంటలు ఆర్పివేశారు. సుమారు రూ.60 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు యాజమాని తెలిపారు.
కూకట్పల్లి: బాలానగర్ పరిధిలోని గాంధీనగర్పారిశ్రామికవాడలోనూ అగ్నిప్రమాదం జరిగింది. సూర్యతేజ ఇండస్ట్రీస్ కంపెనీలో ఆదివారం రాత్రి స్వల్ప అగ్నిప్రమాదం జరగగా, ఫైర్ సిబ్బంది సకాలంలో చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఆస్తి నష్టం తక్కువగానే ఉందని, షార్ట్సర్య్యూట్ కారణంగానే మంటలు వ్యాపించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై బాలానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.