![ఉప్పల్ భగాయత్కు తాగునీటి సప్లయ్.. వాటర్బోర్డుకే నిర్వహణ బాధ్యతలు](https://static.v6velugu.com/uploads/2023/04/water-problems_WPmi52gKF3.jpg)
ఉప్పల్, వెలుగు: ఉప్పల్ భగాయత్ లే ఔట్లో ఉండే వారికి ఇకపై తాగునీటి కష్టాలు తీరనున్నాయి. తాగునీటి సరఫరా, మురుగు నీటి వ్యవస్థ నిర్వహణను వాటర్బోర్డు త్వరలో చేపట్టనుంది. ఇందులో భాగంగా ఎండీ దానకిశోర్ హెచ్ఎండీఏ అధికారులతో కలిసి గురువారం ఆ ప్రాంతాన్ని సందర్శించారు.
రాబోయే మూడేళ్ల వరకు ఈ ప్రాంతంలో మంచినీటి సరఫరా, మురుగు నీటి నిర్వహణను వాటర్బోర్డు చేపట్టనుండగా.. దీనికయ్యే ఖర్చును హెచ్ఎండీఏ భరించేలా ప్రతిపాదనలు రూపొందించాలని ఎండీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వాటర్బోర్డు ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ బాబు, ఆపరేషన్స్ డైరెక్టర్–-2 స్వామి, సీజీఎం సుజాత, హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి, ఎస్ఈ యూసఫ్ హుస్సేన్ తో పాటు ఇరు శాఖల అధికారులు పాల్గొన్నారు.