హైదరబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు అజరుద్దీన్ కేసు నమోదైంది. హెచ్ సీఏ సిఇఓ సునీల్ కంటె 2023, అక్టోబర్ 19వ తేదీ గురువారం ఉదయం ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో అజరుద్దీన్ పై ఫిర్యాదు చేశారు.
Also Read :- కేరళ నుంచి తెలంగాణకు లారీలో రూ.750 కోట్ల డబ్బు
జిమ్ ఎక్విప్మెంట్ , ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్, క్రికెట్ బాల్స్, బకెట్ ఛైర్స్ కొనుగోలులో భారీగా అవకతవకలు ఉన్నాయంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కొనుగోలు కమిటీలో ఉన్న అజారుద్దీన్, జాన్ మనోజ్, విజయానంద్ ల మీద ఉప్పల్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.కొనుగోలు అవకతవకలపై దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.