ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియం.. ఈ పేరు వినపడగానే తెలుగు అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. చెప్పుకోవడానికి అంతర్జాతీయ వేదికైనా.. అరకొర మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తుండడమే అందుకు కారణం. ఉప్పల్ స్టేడియం ఏం పాపం చేసిందో తెలియదు కానీ, బీసీసీఐ ఎప్పుడూ పక్షపాతం చూపిస్తూ ఉంటుంది. తోటి దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, బెంగళూరులో పదుల సంఖ్యలో మ్యాచ్‌లు జరిగితే.. మన ఉప్పల్‌లో జరిగే వాటిని చేతి వేళ్లపై లెక్కించొచ్చు. ఏడాదికి ఒకటో.. రెండో. పోనీ సరైన ఏర్పాట్లు చేయట్లేరా! పిచ్ అనుకూలించట్లేదా! అంటే అదీ కాదు.
రాజీవ్ గాంధీ స్టేడియంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ప్రశంసలు కురిపించింది. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో పలు మ్యాచ్‌లకు ఉప్పల్ స్టేడియం ఆతిథ్యమిచ్చిన విషయం తెలిసిందే. వార్మప్ మ్యాచ్‌లు కాకుండా లీగ్ దశలో మూడు మ్యాచ్ (పాకిస్థాన్ vs నెదర్లాండ్స్, న్యూజిలాండ్ vs నెదర్లాండ్స్, పాకిస్తాన్ vs శ్రీలంక)లు జరగాయి. వీటిని హైదరాబాద్ క్రికెట్ అసోషియషన్(హెచ్ సీఏ) అద్భుతంగా నిర్వహించిందని ఐసీసీ వెల్లడించింది. మంచి పిచ్‌లు సిద్ధం చేశారని మెచ్చుకుంటూనే.. బీసీసీఐ సైతం ఆశ్చర్యపోయేలా రేటింగ్ ఇచ్చింది.
ఉప్పల్ వరల్డ్ కప్ మ్యాచ్‌లకు ఐసిసి రేటింగ్
- పాకిస్థాన్ vs నెదర్లాండ్స్- గుడ్
- న్యూజిలాండ్ vs నెదర్లాండ్స్ - గుడ్
- పాకిస్తాన్ vs శ్రీలంక - వెరీ గుడ్
The Uppal Stadium in Hyderabad received a 'Good' and ‘very good’ pitch rating from the ICC for the World Cup matches. The outfield also received a 'Good' rating.
— ORANGE ARMY (@SUNRISERSU) December 9, 2023
Pakistan vs Netherlands - Good
New Zealand vs Netherlands - Good
Pakistan vs Sri Lanka - Very Good
Staff men ? pic.twitter.com/bqcf0pOrVJ
బీసీసీఐలో మార్పు రావాలి
ఐసీసీ రేటింగ్ చూసైనా బీసీసీఐ పెద్దల్లో మార్పు రావాలని తెలుగు అభిమానులు సోషల్ మీడియాలో గళ మెత్తుతున్నారు. దేశమంటే కోల్‌కతా, ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్ వంటి నాలుగు నగరాలే కాదని అన్నింటిని సమానంగా చూడాలని బుద్ధి చెప్తున్నారు.