
- పీసీసీ ప్రచార కమిటీ కోకన్వీనర్ ఉప్పల శ్రీనివాసగుప్తా
హైదరాబాద్, వెలుగు: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని పీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కోకన్వీనర్, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ శాఖ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆదివారం నాగోల్‌లోని ఓ కన్వన్షెన్ సెంటర్‌లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.
నేడు మహిళలు బయటకు వచ్చి మగవాళ్లతో సమానంగా పోటీ పడుతూ చదువు, ఉద్యోగాల్లో రాణిస్తున్నారని అన్నారు. హైకోర్ట్ జడ్జి జస్టిస్ సూరేపల్లి నంద మాట్లాడుతూ.. మహిళ దినోత్సవ వేడుకలకు ఇంత పెద్ద ఎత్తున మహిళలు రావటం అభినందనీయమన్నారు. రాజకీయాల్లోకి వచ్చే మహిళల సంఖ్య పెరగాలని, అన్ని రంగాల్లో రాణించాలని ఆమె ఆకాంక్షించారు. కాగా, ఈ సందర్భంగా మహిళలకు పలు క్రీడా పోటీలు నిర్వహించగా గెలిచిన వారికి బహుమతులను అందజేశారు.