నేషనల్‌‌ వాలీబాల్‌‌ పోటీలకు ఉప్పరపెల్లి స్టూడెంట్లు

వర్ధన్నపేట, వెలుగు : వరంగల్‌‌ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లికి చెందిన నలుగురు స్టూడెంట్లు యూనివర్సిటీ లెవల్‌‌ వాలీబాల్‌‌ పోటీల్లో జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. గ్రామానికి చెందిన, టీఎస్‌‌డబ్ల్యూఆర్డీసీ వరంగల్‌‌ వెస్ట్‌‌లో డిగ్రీ చదువుతున్న ఎస్‌‌.అను కావ్యాంజలి, డి.వైష్ణవి కేయూ టీంకు,  టీఎస్‌‌డబ్ల్యూఆర్డీసీ సిరిసిల్లలో చదువుతున్న అనూష, హారిక శాతావాహన యూనివర్సిటీ టీంకు ఎంపికయ్యారు.

ఈ నెల 29 నుంచి 31 వరకు తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీలో జరిగే జాతీయ స్థాయి వాలీబాల్‌‌ పోటీలకు ఈ నలుగురు స్టూడెంట్లు హాజరుకానున్నారు. స్టూడెంట్లను సర్పంచ్‌‌ స్రవంతి, కాలేజీ ప్రిన్సిపాల్‌‌ దయాకర్, పద్మజ, వాలీబాల్ కోచ్‌‌లు సతీశ్‌‌, సరితాదాస్‌‌ అభినందించారు. 

రాష్ట్రస్థాయి నెట్‌‌బాల్‌‌ పోటీలకు మోడల్‌‌ స్కూల్‌‌ స్టూడెంట్లు

నర్సింహులపేట, వెలుగు : మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలోని మోడల్‌‌ స్కూల్‌‌ స్టూడెంట్లు రాష్ట్ర స్థాయి నెట్‌‌బాల్‌‌ పోటీలకు ఎంపికయ్యారు.  స్కూల్ కు చెందిన పూర్ణిమ, నిత్య, హరిత, నవ్య శ్రీ, చందన, రఘు, ఇసాక్‌‌ రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు పీడీ శ్రీను తెలిపారు. వీరు ఈ నెల 30, 31, జనవరి 1 న నాగార్జునసాగర్‌‌లో జరిగే జూనియర్‌‌ నెట్‌‌ బాల్‌‌, ఫాస్ట్‌‌ ఫైవ్‌‌ నెట్‌‌బాల్‌‌ పోటీలకు హాజరవుతారని ఆయన చెప్పారు. స్టూడెంట్లను ఇన్‌‌చార్జి ప్రిన్సిపాల్‌‌ మల్లేశ్వరరావు, టీచర్లు అభినందించారు.