
పాపన్నపేట, వెలుగు: తెలంగాణ, ఏపీ ఆధ్వర్యంలో నిర్వహించే అన్నమయ్య సంకీర్తనలు, సంగీత, సాహిత్య అకాడమీ పోటీల్లో మెదక్ జిల్లా పాపన్నపేట మండలం యూసుఫ్ పేట్ గ్రామానికి చెందిన ఉప్పరి భువనేశ్వర్ ఎంపికయ్యారు.
ఈనెల 23 నుంచి 26వ వరకు తిరుపతిలో జరిగే ఈ పోటీల్లో పాల్గొంటాడు. రామయంపేట స్వామి వివేకానంద ఆవాస విద్యాలయ ప్రముఖ్ శ్రీనివాస్ ఆచార్య గారి ప్రోత్సాహం వల్లే తాను ఈ పోటీలకు ఎంపికైనట్లు భువనేశ్వర్ వెల్లడించారు.
Also Read : ఖానాపూర్ బల్దియాలో నెగ్గిన అవిశ్వాసం