పెద్ద కులాలు ఎటు వైపు?

బ్రాహ్మణ – బనియా పార్టీగా పేరున్న బీజేపీ పెద్ద కులాలకు దూరమైందా అనే ప్రశ్న ఇప్పుడు తెరమీదకువచ్చింది. రకరకాల కారణాలతో పెద్ద కులాలు బీజేపీ విషయంలో పునరాలోచనలో పడ్డాయంటున్నవాదన వినిపిస్తోంది. ‘బ్రాహ్మిన్స్ కా టికెట్ కాటా, కాయస్తోంకీ నాక్ కాటీ, బనియో కీ జేబ్ కటీ’ నినాదం బీజేపీని ఇంతకాలం నమ్ముకున్న వర్గాల్లో ఆక్షేపణగా ఉంది. దీనికి చెక్ పెట్టేందుకు పెద్దకులాల్లోని పేదలకు10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం చట్టం కూడా చేసినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందంటున్నారు. మరి, ఈసారి ఎన్నికల్లో పెద్ద కులాల మద్దతు ఎటువైపునో?

బీజేపీకి పెద్దకులాల పార్టీగా ఒకప్పుడు రాజకీయవర్గా ల్లో పేరుండేది. రెండు మూడేళ్లుగా జరిగిన పరిణామాల నేపథ్యంలో కమలానికి పెద్ద కులాలు దూరమైనట్టు రాజకీయ పండితులు చెబుతున్నారు. దీనికి అనేక కారణాలను విశ్లేషిస్తున్నారు. ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, కల్ రాజ్ మిశ్రా, సుమిత్రామహాజన్ వంటి సీనియర్లను పక్కన పెట్టిన ప్రభావం పార్టీపై చాలా సైలెంట్‌ గా పడిందంటున్నారు. యాక్సిడెంటల్‌‌గా ఈ సీనియర్లందరూ పెద్ద కులాల వాళ్లే. దీంతో కొన్నేళ్లుగా పార్టీకి మద్దతునిచ్చిన వాళ్లంతా ఈసారి మద్దతు విషయంలో ఆలోచనలో పడ్డట్టు సమాచారం. ‘బ్రాహ్మిన్స్ కా టికెట్ కాటా, కాయస్తోంకీ నాక్ కాటీ, బనియో కీ జేబ్ కటీ ’ ( బ్రాహ్మణులకుటికెట్లు ఇవ్వలేదు, కాయస్తులను అవమానపరిచారు, బనియా కులస్తుల జేబులు ఖాళీ అయ్యాయి) ఢిల్లీపొలిటికల్ సర్కిల్‌‌లో ఈ కొత్త మాట ఇప్పుడు హల్చల్ చేస్తోంది.

మొదటి
నుంచి పెద్ద కులాల మద్దతు
రాజకీయ వర్గాల్లో ‘బ్రాహ్మణ – బనియా పార్టీ’గా పాపులర్. నార్త్ ఇండియాలో దాదాపుగా అన్ని అగ్రకులాలు బీజేపీకి వెన్నుదన్నుగా నిలబడ్డాయి. సంప్రదాయంగా తమకు మద్దతు ఇస్తున్న పెద్ద కులాలు మెల్లమెల్లగా దూరమవుతున్న విషయాన్ని బీజేపీ గమనించింది. మూడు హిందీ రాష్ట్రాల (మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌ గఢ్‌ ల్లో ) ఓటమితో బీజేపీకి మైండ్ బ్లాక్ అయింది. తమ పార్టీని కొన్ని పెద్ద కులాలు దూరంపెట్టడం వల్లనే ఆ మూడు రాష్ట్రాల్లోనూ ఓడిపోయినట్లు బీజేపీ ఒక అభిప్రాయానికి వచ్చినట్లు రాజకీయవర్గాల సమాచారం. 2014 ఎన్నికల్లో బీజేపీకి ఈమూడు రాష్ట్రాల నుంచి ఎక్కువ సీట్లు దక్కాయి. బీజేపీకి పెట్టని కోటల్లాంటి ఈ రాష్ట్రాల్లో ఓటమితో పార్టీలో ఆలోచన మొదలైంది. ఎస్‌సీ, ఎస్‌టీ వేధింపుల (నిరోధక) చట్టం తో కొన్నిపెద్ద కులాలు బీజేపీకి దూరమైనట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ చట్టంలోని కొన్ని క్లాజ్‌‌లను, సెక్షన్లను సుప్రీంకోర్టు కొట్టివేస్తూ, నిర్ణయం తీసుకుంటే దానిని మోడీ ప్రభుత్వం సవరించే ప్రయత్నం చేసింది. యధాతథ స్థితికి ఎస్‌సీ, ఎస్‌టీ యాక్ట్‌‌ని పునరుద్ధరిస్తూ పార్లమెంటులో చట్టం చేసింది. ఈ విషయంలోపార్టీ తీసుకున్న నిర్ణయం అగ్రకులాలకు కోపం తెప్పించి నట్లు బీజేపీ వర్గాల కథనం. ఇదొక్కటే కాదు,మురళీ మనోహర్ జోషి, కల్ రాజ్ మిశ్రా వంటి అగ్రకులాలకు చెందిన సీనియర్ నాయకుల విషయంలోనూ పార్టీ నిర్ణయాల ప్రభావం ఆయా కులాలపై తప్పకుండా పడుతుందని అంచనా వేస్తున్నాయి..

అగ్రపేదలకు 10 శాతం కోటాపై ఆశలు
పెద్ద కులాల్లో ని పేదలకు ఎకనామికల్లీ బ్యాక్‌‌వర్డ్‌‌ సెక్షన్స్‌‌ (ఈడబ్ల్యుఎస్‌ ) పేరుతో విద్య, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టంచేసింది. దూరమైన అగ్రకులాలు తిరిగి తమ వైపువస్తాయని బీజేపీ వర్గా లు భావిస్తున్నాయి. ఈ చట్టంవల్ల రిజర్వేషన్ల కోసం ఆందోళన చేస్తున్న పటేల్, జాట్వంటి పెద్ద కులాల్లో ని పేదలు తమకు అండగా నిలబ-డతారన్న ధీమా కాషాయ పార్టీ వర్గా ల్లో కనిపిస్తోంది.

మరి… రాజ్ పూత్ లు?
బీజేపీకి మొదటి నుంచీ అండగా ఉంటున్న రాజ్పుత్వర్గం ఈసారి ఎవరికి మద్దతు ఇస్తుందన్న ప్రశ్న తెరమీదకు వచ్చింది. రాజస్థాన్తో పాటు పశ్చిమయూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్ లో రాజ్పుత్ ల ప్రభావం ఎక్కువ. ఈ కమ్యూ నిటీకి చెందిన మానవేంద్ర సింగ్ కిందటి ఏడాది బీజేపీకి గుడ్ బై కొట్టి కాంగ్రెస్ లో చేరారు. 2014 లోక్సభ ఎన్నికల్లో మానవేంద్ర సింగ్ తండ్రి, మాజీ కేంద్ర మంత్రి జశ్వంత్సింగ్కు టికెట్ ఇవ్వలేదు. దీంతో బార్మెర్ జైసల్మేర్ నియోజకవర్గం నుంచి ఆయన ఇండిపెండెంట్ గాపోటీ చేసి ఓడిపోయారు. ఇక, మానవేంద్ర సింగ్ కూడా బీజేపీ అధికారిక అభ్యర్థికి కాకుండా ఇండిపెండెంట్ గా దిగిన జశ్వంత్ సింగ్కే ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో మానవేంద్ర సింగ్ను బీజేపీ నుంచి బహిష్కరించడం, ఆయన కాంగ్రెస్ లో చేరిపోవడం జరిగిపోయాయి. 1980 నుంచి 2004 అయిదుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన జశ్వంత్ సింగ్ ప్రస్తుతం అనారోగ్యంతో కోమాలో ఉండగా, మానవేంద్ర సింగ్ కాంగ్రెస్ టిక్కెట్ పై బర్మేర్ నుంచి పోటీచేస్తున్నారు.