గ్యాస్ లీకేజ్ నియంత్రణ చర్యలు: ఆందోళనలో గ్రామస్థులు

గ్యాస్ లీకేజ్ నియంత్రణ చర్యలు: ఆందోళనలో గ్రామస్థులు

ఆంధ్ర ప్రదేశ్: తూర్పుగోదావరి జిల్లా ఉప్పూడిలో గ్యాస్ లీకేజ్ నియంత్రణ చర్యలు మూడోరోజుకు చేరుకున్నాయి. ప్లాన్ 2 ప్రకారం గ్యాస్ లీకేజ్ ను తగ్గించడానికి ONGC,  ఫైర్ సిబ్బంది పనులను ప్రారంభించింది. మడ్ వాటర్ ను పంపింగ్ చేయడానికి వెహికిల్స్ ను రెడీ చేసింది. ONGC గ్రూప్ జనరల్ మేనేజర్ ఆదేశ్ కుమార్ ఆద్వర్యంలో పనులు పడుస్తున్నయి. 80వేల టీటర్ల మడ్ వాటర్ ను రెడీ చేసినట్లు సమాచారం. అయితే.. మూడురోజులైనా గ్యాస్ లీకేజీని కంట్రోల్ కాకపోవడంతో ఉప్పూడి గ్రామస్థులు టెన్షన్ పడుతున్నరు. ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలపై అసహనం వ్యక్తం చేస్తున్నరు. మీడియాతో మాట్లాడిన గ్రామస్థులు.. రెండురోజులుగా తాము చీకటి బతుకులను చవిచూస్తున్నామని, పునరావాస కేంద్రాలలో కూడా వసతులు బాగాలేవని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.