- అదానీ వ్యవహారంపై చర్చించాలని డిమాండ్
- పాల్గొన్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
ఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అధికార ఎన్డీఏ, విపక్ష కూటమి మధ్య మాటల యుద్ధం నడిచింది. సమావేశాల్లో అదానీ అవినీతి వ్యవహారం, సంభాల్ అల్లర్లు, బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు ఇలా పలు అంశాలపై చర్చించాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు సభా సమయాన్ని వృథా చేసేందుకే విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని అధికార ఎన్డీఏ ఆరోపిస్తోంది.
ALSO READ : ఒక్కడినే వెళ్తానన్నా ఒప్పుకోలే.. పోలీసుల తీరుపై రాహుల్ గాంధీ ఆగ్రహం
ఈ నేపథ్యంలోనే తాజాగా ఇవాళ కూడా పార్లమెంట్ హాల్ ముందు విపక్ష ఎంపీలు వినూత్న నిరసన తెలిపారు. అదానీ వ్యవహారంపై చర్చ చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ముందు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేశారు. మోదీ, అదానీ ఏక్ హై, అదానీ సేఫ్ హై అని ప్రింట్ చేసిన బ్లాక్ జాకెట్స్ ను ధరించి విపక్ష ఎంపీలు పార్లమెంట్ కు హాజరయ్యారు.
నిరసనలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. అదానీ అవినీతి వ్యవహారంపై సభలో చర్చించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.