
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై సుంకాల యుద్దం ప్రకటించిన విషయం తెలిసిందే..ట్రంప్ సుంకాల ప్రభావం భారత్పై కూడా చూపుతోంది. భారత్ పై 27 శాతం ప్రతీకార సుంకం విధించారు. అయితే ట్రంప్ సుంకాలు..భారత్కు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని శుక్రవారం (ఏప్రిల్4) లోక్ సభలో విపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. విపక్ష సభ్యులపై అధికార పక్షం సభ్యులు ఎదురుదాడికి దిగారు.
జాస్వామ్యం వ్యాఖ్యలపై సోనియా గాంధీ సారీ చెప్పాలని ఆందోళనకు దిగారు. దీంతో తీవ్రగందరగోళం మధ్య సభను అరగంట పాటు వాయిదా వేశారు. మోదీ సర్కార్ డౌన్ డౌన్ అంటూ విపక్ష సభ్యులు నినాదాలు చేశారు.ట్రంప్ సుంకాలపై ప్రధాని మోదీ సభకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ట్రంప్ టారిఫ్ లపై పార్లమెంట్ సమగ్ర విచారణ జరగాలని పట్టుపట్టారు. సభ వాయిదా పడ్డాక కూడా పార్లమెంట్ మకర ద్వారం దగ్గర విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు.