Viral Video: జిల్లా మేజిస్ట్రేట్కే నకిలీ బిస్లెరి వాటర్ సప్లయ్..కంపెనీపై బుల్డోజర్ చర్య

Viral Video: జిల్లా మేజిస్ట్రేట్కే నకిలీ బిస్లెరి వాటర్ సప్లయ్..కంపెనీపై బుల్డోజర్ చర్య

ఇటీవల కాలంలో కల్తీ ఎక్కువై పోయిందని.. ఏదీ వరిజినల్ దొరకడం లేదు..ఉప్పు, పప్పు, సబ్బులు, నూనెలు, వాటర్ ఇలా చెప్పుకుంటూ పోతే నిత్యావసరాలన్నీ కల్తీ అవుతున్నాయని గగ్గోలు పెడుతున్నారు జనం. మరీ సామాన్య ప్రజలకే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందా అంటే..కల్తీ వస్తువులు ఎవరికైనా అమ్ముతాం..మాకు సామాన్యులు, ఉన్నతాధికారులు అనే తేడా ఏం లేదు ఎవరినైనా మోసం చేస్తాం అని  నిరూపిస్తున్నారు కల్తీగాళ్లు. ఉత్తరప్రదేశ్ లోని బాగ్ పత్ జరిగిన ఈ సంఘటన అందుకు ఉదాహరణ. 

ఉత్తరప్రదేశ్ లో ని బాగ్ పత్ ప్రాంతంలో ఏకంగా జిల్లా మేజిస్ట్రేట్ కే నకిలీ వాటర్ సప్లయ్ చేసిన సంఘటన జరిగింది. నకిలీ వాటర్ సప్లయ్ చేసిన కంపెనీని గుర్తించి వేల సంఖ్యలో నకిలీ బ్రాండ్ వాటర్ బాటిళ్లను ధ్వంసం చేశారు. ప్రముఖ బ్రాండ్ కంపెనీ బిస్లరీ కి నకిలీ గా బిల్సేరి లేబుళ్లతో 500 ml  వాటర్ బాటిళ్లను అమ్ముతున్నారని గుర్తించారు. దీనికి సంబంధించి పోలీసులు విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

బాగ్ పత్ జిల్లా మేజిస్ట్రేట్ జితేంద్ర ప్రతాప్ సింగ్, ఎస్పీ అర్పిత్ విజయ వర్గియాలు అధికారికంగా సమావేశం అయ్యారు. సమావేశంలో వారి ముందుంచిన వాటర్ బాటిళ్లను చూసి ఆశ్చర్యపోయారు. DM వాటర్ బాటిళ్లను చేతిలోకి తీసుకుని నిశితంగా పరిశీంచి ఆశ్చర్యపోయారు. నకిలీ బ్రాండ్ లేబుల్, ఫుడ్ సెక్యూరిటీ పర్మిషన్ లేని వాటర్ సప్లయ్ చేస్తున్న కంపెనీపై చర్యలకు ఆదేశించారు. 

గౌరీ పూర్ కు చందిన భీంసింగ్ అనే వ్యక్తి.. అక్రమంగా ఇంటివద్దనే నకిలీ వాటర్ దందా నిర్వహిస్తున్నారు. ఇందుకోసం పెద్ద గోడౌన్ కూడా నిర్మించాడు. జిల్లావ్యాప్తం గా అనేక షాపులకు నకిలీ వాటర్ బాటిళ్లను సప్లయ్ చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. 

Also Read :- నవంబర్​ 12 నుంచి మోగనున్న పెళ్లి బాజాలు

కస్టమర్లను ఉద్దేశ్యపూర్వకంగా తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో బిల్సేరీ, బిస్లారీ వంటి పేర్లతో ఒరిజినల్ కంపెనీ బిస్లరీ ప్యాకేజింగ్ ను అనుకరించేలా తప్పుడు లేబు ల్స్ వేసిన 2663 బాటిళ్లను గుర్తించి బుల్డోజర్ తో ధ్వంసం చేశారు. ఎటువంటి అనుమతుల్లేకుండా నిర్వహిస్తున్న గోడౌన్ ను సీజ్ చేశారు. యజమానిపై చట్ట పరమైన చర్యలు తీసుకున్నారు. నకిలీ ఆహార ఉత్పత్తులను విక్రయిస్తున్న ఇటువంటి సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్థానికులకు జిల్లా మేజిస్ట్రే ట్అ ప్రమత్తం చేశారు.