యూపీలో ఓ చిన్నారి తన తండ్రిని విడిచిపెట్టాలంటూ పోలీసులను వేడుకుంటున్నఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన తండ్రి కోసం ఆ చిన్నారి పోలీసుల వాహనానికి తలను బాదుకోవడం చూస్తే కన్నీళ్లు వస్తాయి. అసలేం జరిగిందంటే.. యూపీలో పటాకులపై ఇప్పటికే నిషేధం ఉంది. బులంద్ షహర్ లోని ఖుర్జా ఏరియాలో కొందరు షాపులు పెట్టి క్రాకర్స్ అమ్ముతున్నారు. అక్కడే ఓ చిరు వ్యాపారి రోడ్ సైడ్ లో చిన్న షాప్ పెట్టుకున్నాడు. ఇంకా అక్కడ చాలా మంది షాపులు పెట్టుకున్నారు. ఐతే… పోలీసులు వచ్చి ఆ వ్యక్తి షాపులోని పటాకులను చిందరవందరగా పడేశారు. ఆ వ్యక్తిని ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. తన తండ్రిని తీసుకెళ్లొద్దంటూ ఆ వ్యక్తి కూతుళ్లు పోలీసులను అడ్డుకున్నారు. విడిచిపెట్టాలని పోలీసులను బతిమిలాడారు. పోలీసులు ఆ చిన్నారుల మాటలు పట్టించుకోలేదు. ఆ వ్యక్తిని జీపు ఎక్కించబోయారు. ఇది చూసి తట్టుకోలేని ఆయన కూతురు..తన తండ్రిని వదిలేయాలని జీపుకు తల బాదుకుంది. అక్కడ చాలా మంది పోలీసులున్నా.. ఆ చిన్నారిని పక్కకు తీయలేదు.
చిన్నారి ఆవేదనను చూసి అక్కడ ఉన్నవాళ్లంతా చలించిపోయారు. చిన్నారి బాధను చూసి ఆ వ్యక్తిని విడిచిపెట్టాలని కోరినా పోలీసులు వినిపించుకోలేదు. అడ్డమొచ్చిన వారిని కాళ్లతో తంతూ.. వారిని బెదిరించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యూపీ పోలీసుల తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. కొన్ని సడలింపులు ఇచ్చినా పోలీసులు మాత్రం షాపు ఓనర్లపై ప్రవర్తిస్తున్న తీరు విమర్శలకు దారి తీసింది.
In UP's Bulandshahar district, police crackdown against vendors selling crackers, despite ban, in a busy market in Khurja area. Bulandshahar is among 13 of the cities in state where there is blanket ban on crackers. pic.twitter.com/owFO1pqZPo
— Piyush Rai (@Benarasiyaa) November 13, 2020