మోస్ట్ పాపులర్ సీఎంలలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సెకండ్ ప్లేస్ లో నిలిచారు. ప్రజాదరణ, ఆమోదయోగ్యతను అంచనా వేయడాని తాజాగా ఓ సంస్థ సర్వే చేయగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 52.7 శాతం పాపులారిటీ రేటింగ్‌తో అగ్రస్థానంలో నిలిచారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 51.3 శాతం పాపులారిటీ రేటింగ్‌తో రెండో స్థానంలో నిలిచారు. 48.6 శాతం రేటింగ్‌తో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మూడో స్థానంలో ఉండగా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ 42.6 శాతం రేటింగ్‌తో నాలుగో స్థానంలో ఉన్నారు. 41.4 శాతంతో డాక్టర్ మాణిక్ సాహా ఐదు స్థానంలో నిలిచారు.
యోగీ ఆదిత్యనాథ్ ఇటీవలే ఎక్స్ ( ట్విట్టర్) లోఅత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రిగా నిలిచారు. ఎక్స్ లో యోగి ఆదిత్యనాథ్ ఫాలోవర్ల సంఖ్య 27.4 మిలియన్ మార్క్‌ను దాటింది. ప్రధాని నరేంద్ర మోడీ (95.1 మిలియన్ ఫాలోవర్లు), హోం మంత్రి అమిత్ షా (34.4 మిలియన్ ఫాలోవర్లు) యోగి కంటే ముందున్నారు.
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు 19.1 మిలియన్ల మంది, రాహుల్ గాంధీకి 24.8 మిలియన్ల మందిఫాలోవర్లు ఉన్నారు. 2019 జనవరిలో ప్రారంభమైన యోగి ఆదిత్యనాథ్ ఎక్స్ ఖాతా ప్రస్తుతం దేశంలో సీఎంలలో అత్యధిక మంది అనుచరులను కలిగి ఉన్న వ్యక్తిగత అధికారిక ఖాతాగా మారింది.