
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (అసిస్టెంట్ కమాండెంట్) ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పరీక్ష ద్వారా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్, సశస్త్ర సీమా బల్‌లో అసిస్టెంట్ కమాండెంట్ల (గ్రూప్ ఎ) ఉద్యోగాలు భర్తీ కానున్నాయి.
ఖాళీలు: మొత్తం 322 పోస్టుల్లో బీఎస్‌ఎఫ్- 86, సీఆర్‌పీఎఫ్- 55, సీఐఎస్‌ఎఫ్- 91, ఐటీబీపీ- 60, ఎస్‌ఎస్‌బీ- 30 ఖాళీగా ఉన్నాయి.
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి. వయసు 20 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష (పేపర్ 1, పేపర్ 2), ఫిజికల్ స్టాండర్డ్స్/ ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో మే 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష ఆగస్టు 6న నిర్వహిస్తారు. వివరాలకు www.upsc.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.