యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అసిస్టెంట్ ప్రోగ్రామర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతోంది. అభ్యర్థులు నవంబర్ 28వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి.
అర్హతలు: పోస్టును బట్టి డిగ్రీ, బీటెక్, పీజీలో ఉత్తీర్ణులై ఉండాలి. వయసు జనరల్ అభ్యర్థులకు 30 ఏండ్లు, ఓబీసీలు 33 ఏళ్లు, ఎస్సీ/ ఎస్టీలు 35 ఏళ్లు మించకూడదు.
సెలెక్షన్ ప్రాసెస్: ఎగ్జామ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్స్: నవంబర్ 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు రూ.25 (మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది) చెల్లించాలి. వివరాలకు www.upsc.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.