UPSC చైర్మన్ మనోజ్ సోనీ రాజీనామా.. కారణాలివే..

UPSC చైర్మన్ మనోజ్ సోనీ రాజీనామా.. కారణాలివే..

న్యూఢిల్లీ:యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మనోజ్ సోని తన పదవికి రాజీనామా చేశారు. మనోజ్ సోనీ రాజీనామాను రాష్ట్రపతి ఇంకా ఆమోదించలేదు. పదవీ కాలం ఐదేళ్లు మిగిలిఉండగానే ఆయన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేశారు. అయన పదవీకాలం 2029లో ముగియనుంది. మనోజ్ సోని 2017లో కమిషన్ సభ్యుడిగా , 2024 మే 16న చైర్ పర్సన్ గా బాధ్యతలు స్వీకరించారు. 

గుజరాత్ లోని స్వామినారాయణ శాఖకు చెందిన అనూపమ్ మిషన్ కు ఎక్కువ సమయం కేటాయించడానికి మనోజ్ సోనీ ముందుగానే రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. 2020 లో మిషన్ లో దీక్షను స్వీకరించిన తర్వాత కర్మయోగిగా మారారు UPSC చైర్ పర్సన్ మనోజ్ సోనీ  అయితే ట్రైనీ ఐఏష్ పూజా ఖేడ్కర్ కేసు లో బాధ్యత వహిస్తూ రాజీనామా చేసినట్లు వార్తలు వస్తున్నాయి.