పూజా ఖేడ్కర్ వివాదంతోనే UPSC చైర్మన్ రాజీనామా: జైరాం రమేష్

పూజా ఖేడ్కర్ వివాదంతోనే UPSC చైర్మన్ రాజీనామా: జైరాం రమేష్

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) చైర్మన్ మనోజ్ సోనీ వ్యక్తి కారణాలతో రాజీనామా చేశారని శనివారం (జూలై 20,2024) చేసిన ప్రకటన రాజకీయ దుమారం రేపింది. సోనీ రాజీనామాకు వ్యక్తిగత కారణాలే అని ప్రకటించడంపై కాంగ్రెస్ మండిపడుతోంది. మనోజ్ సోనీ రాజీనామా యూపీఎస్సీ కమిషన్ చుట్టూ కొనసాగుతున్న వివాదాలతో ముడిపడి ఉందని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది. IAS ట్రైనీ పూజా ఖేడ్కర్ అభ్యర్థిత్వం చుట్టూ కొనసాగుతున్న వివాదం సమయంలో  ఎందుకు రాజీనామా చేశారని ప్రశ్నించింది. ప్రణాళిక ప్రకారమే మనోజ్ సోనీ రాజీనామా చేశారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. 

మనోజ్ సోనీ రాజీనామాకు, ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారి పూజా ఖేడ్కర్ వివాదానికి ఎటువంటి సంబంధం లేదని అధికారిక వర్గాలు చెబుతున్నప్పటికీ ఆయన రాజీనామా అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. వాస్తవానికి యూపీఎస్సీ చైర్మన్ గా సోనీ పదవీకాలం 2029లో ముగియనుంది. 

also raed: UPSC చైర్మన్ మనోజ్ సోనీ రాజీనామా.. కారణాలివే..

2014 నుంచి ప్రధాని నరేంద్రమోదీ అధికారం చేపట్టినప్పటి నుంచి దేశంలో రాజ్యాంగ సంస్థల పనితీరు, నిబద్ధతపై కాంగ్రెస్ ఇంఛార్జ్ కమ్యూనికేషన్స్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ తీవ్రంగా విమర్శిచారు. రాజ్యాంగ సంస్థల స్వయంప్రతిపత్తి ని కోల్పోయాయని.. ఎన్డీయే సర్కార్ చెప్పుచేతల్లో పనిచేస్తున్నాయని అన్నారు.

యూపీఎస్సీకి సంబంధించిన ప్రస్తుత వివాదాల కారణంగానే బాధ్యత వహించి రాజీనామా చేశారన్నారు. 2014 నుంచి రాజ్యాంగ సంస్థల నిబద్ధత, పాత్ర, స్వయం ప్రతిపత్తి , పనితీరు దెబ్బతిన్నాయన్నారు జైరాం రమేష్.  జెంటిల్ మ్యాన్ గా పేరున్న మనోజ్ సోని రాజీనామా వెనక రాజకీయ డ్రామా ఉందన్నారు.