UPSC సివిల్స్ ఫలితాలు విడుదల

UPSC సివిల్స్ ఫలితాలు విడుదల

UPSC సివిల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. యూపీఎస్సీ మెయిన్స్ ఫలితాలు 2023లను మంగళవారం (ఏప్రిల్ 16) యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ఇందులో వెయ్యి 16 మంది ఎంపికయ్యారు. ఆదిత్య శ్రీవాత్సవకు మొదటి ర్యాంక్, అనిమేష్ ప్రధాన్కు రెండో ర్యాంక్, దోనూరి అనన్యరెడ్డికి మూడో ర్యాంక్ దక్కింది.

వరంగల్కు చెందిన ఇద్దరు సివిల్స్కు సెలెక్ట్ అయ్యారు. పరీక్షలు రాసిన అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్  upsc.gov.in లో మెరిట్ లిస్ట్ ను చెక్ చేసుకోవచ్చు. 

మొత్తం 1016 మంది అభ్యర్థుల నియామకానికి అర్హత సాధించారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల రోల్ నంబర్లను యూపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 347 మంది జనరల్ అభ్యర్థులు, 116 మంది EWS కేటగిరీ అభ్యర్థులు,303 మంది ఓబీసీ, 165 మంది ఎస్సీ, 86 మంది ఎస్టీ అభ్యర్థులు నామినేట్ అయ్యారు.