UPSC సివిల్ సర్వీసెస్ ఫలితాలు రిలీజ్..ఫస్ట్ ర్యాంక్ శక్తిదూభే..ఎవరీమె

UPSC సివిల్ సర్వీసెస్ ఫలితాలు రిలీజ్..ఫస్ట్ ర్యాంక్ శక్తిదూభే..ఎవరీమె

UPSC సివిల్ సర్వీస్ ఫలితాలు విడుదలయ్యాయి. UPSC సివిల్ సర్వీసెస్ 2024 ఫైనల్ ఫలితాలను  ఏప్రిల్ 22న విడుదల చేశారు.అభ్యర్థులు ఫలితాలను అధికారిక వెబ్ సైట్ upsc.gov.in లో చూడవచ్చు. సివిల్స్ 2024లో  యూపీ ప్రయాగ్ రాజ్ కు చెందిన శక్తి దూబే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ను సాధించారు. రెండో ర్యాంగ్ హర్షత్ గోయల్, మూడో ర్యాంక్  డోంగ్రే అర్చిత్ పరాగ్ సాధించారు. ఈ ఏడాది UPSC సివల్స్ కు మొతత్ం 1009 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇందులో జనరల్ కేటగిరీ అభ్యర్థులు 335, ఈడబ్ల్యూఎస్ 109, ఓబీసీ 318, ఎస్సీలు 160, ఎస్టీలు 87 మంది ఎంపికయ్యారు. 

UPSC CSE 2024 టాపర్స్ జాబితా.. 

హాల్ టికెట్ నం. టాపర్ పేరు  
0240782     శక్తి దూబె 
0101571    హర్షిత గోయల్ 
0867282     డోంగ్రే అర్చిత్ పరాగ్ 
0108110    షా మార్గి చిరాగ్ 
0833621     ఆకాష్ గార్గ్ 
0818290     కోమల్ పునియా 
6902167     ఆయూషి బన్సాల్ 
6613295     రాజ్ కృష్ణ ఝా
0849449     ఆదిత్య విక్రమ్ అగర్వాల్ 
5400180     మయాంక్ త్రిపాఠి

►ALSO READ | పార్లమెంటే సుప్రీం.. ప్రజా ప్రతినిధులే అల్టిమేట్ మాస్టర్స్.. మరోసారి ఉపరాష్ట్రపతి సంచలన వ్యాఖ్యలు

ఎవరీ శక్తి దూబే.. 

తాజా సివిల్స్ ఫలితాల్లో యూపీలోని ప్రయాగ్ రాజ్ కుచెందిన శక్తి దూబె ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఈమె అలహాబాద్ యూనివర్సిటీలో బయోకెమిస్ట్రీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2018 నుంచి సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. శక్తి దుబే సివిల్స్లో పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషన్ల్ రిలేషన్స్ ఆప్షనల్ సబ్జెక్టుగా తీసుకున్నారు.