హైదరాబాద్, వెలుగు: యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ – 2024 పరీక్షను ఈనెల 21,22,23 తేదీల్లో నిర్వహిస్తున్నట్టు, ప్రశాంతంగా కొనసాగించాలని హైదరాబాద్ అడిషనల్ కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ లో యూపీఎస్సీ సంబంధిత అధికారులతో సమావేశమై మాట్లాడారు. హైదరాబాద్ లో 4 కేంద్రాల్లో యూపీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. సెంటర్లలో తగు సదుపాయాలు ఏర్పాటు చేయాలని, పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని సూచించారు. పరీక్ష కేంద్రాల సూపర్ వైజర్లుగా సంబంధిత కాలేజీ ప్రిన్సిపల్ ఉంటారని, 4 సెంటర్లకు లోకల్ ఇన్ స్పెక్షన్ అధికారులు,2 రూట్ ఆఫీసర్లను నియమించినట్టు వివరించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటాచారి, కాలేజీల ప్రిన్సిపల్, లోకల్ ఇన్ స్పెక్షన్ అధికారులు, రూట్ ఆఫీసర్స్ పాల్గొన్నారు.
ఎంక్వైరీ నంబర్లు
ఫోన్ నంబర్ 040-2324833
( పరీక్షల విభాగం)
న్యూఢిల్లీ కంట్రోల్ రూమ్ నంబర్లు
011-23383052, 23382627, 23382703,
ఫ్యాక్స్ నంబర్ 011-23384472, 23385223
పరీక్ష పేపర్లు
1. ఎకనామిక్స్ సర్వీసెస్/ఇండియన్ స్టాటిస్టిక్స్ సర్వీసెస్ – 2024
2. కంబైండ్ జియో సైంటిస్ట్(మెయిన్ )
పరీక్షలు – 2024
3. ఇంజనీరింగ్ సర్వీసెస్(మెయిన్)
పరీక్ష – 2024
ఎగ్జామ్ సెంటర్లు
1. శ్రీ అరబిందో జూనియర్ కాలేజీ, మెహదీపట్నం
2. సాయి చైతన్య జూనియర్ కాలేజీ, మెట్రో పిల్లర్ నం.1517 వద్ద, దిల్ సుఖ్ నగర్
3. న్యూ చైతన్య జూనియర్ కాలేజ్, శాంతి టీవీఎస్ షోరూం హిమాయత్ నగర్
మెయిన్ రోడ్
4. ఐడీఎల్ డిగ్రీ కాలేజీ( మహిళ)ఐడీఎల్జూనియర్ కాలేజీ వెనుక దిల్ సుఖ్ నగర్