
న్యూఢిల్లీ: కరోనా లాక్ డౌన్ కారణంగా మే31న జరగాల్సిన UPSC ప్రిలిమ్స్ పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో ఈ పరీక్షలు మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారోనని అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో UPSC శుక్రవారం కొత్త టైంటేబుల్ ను ప్రకటించింది. UPSC ప్రిలిమ్స్ పరీక్షలను ఈ ఏడాది అక్టోబరు 4వ తేదీన నిర్వహించనున్నారు. ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణులైన వారికి వచ్చే ఏడాది జనవరి 8న మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. UPSC కొత్త టైంటేబుల్ ను ప్రకటించడంతో అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.