UPSC Recruitment:111 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగాలు..చివరి తేది మే1

UPSC  Recruitment:111 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగాలు..చివరి తేది మే1

అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)  నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు UPSC అధికారిక వెబ్ సైట్ upsc.gov.in లో లాగిన్ అయి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 111 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఇతర పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు మే 1, 2025 లాస్ట్ డేట్.

ఖాళీగా ఉన్న మొత్తం పోస్టులు.. 

  •  సిస్టమ్ అనలిస్ట్: 1 పోస్ట్
  • డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్‌ప్లోజివ్స్: 18 పోస్టులు
  • అసిస్టెంట్ ఇంజనీర్: 9 పోస్టులు
  •  జాయింట్ అసిస్టెంట్ డైరెక్టర్: 13 పోస్టులు
  • అసిస్టెంట్ లెజిస్లేటివ్ కౌన్సెల్: 4 పోస్టులు
  •  అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్: 66 పోస్టులు

అర్హతలు 

పైన పేర్కొన్న పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఇక్కడ అందుబాటులో వివరణాత్మక నోటిఫికేషన్ ద్వారా వారి విద్యార్హతలు,వయోపరిమితిని తనిఖీ చేయవచ్చు.

ఎలా దరఖాస్తు చేయాలంటే.. 

అభ్యర్థులు ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ అప్లికేషన్ (ORA) వెబ్‌సైట్ https://upsconline.gov.in/ora/లో ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. 

ఇంటర్వ్యూ ద్వారా గానీ, రిక్రూట్‌మెంట్ టెస్ట్ (RT) ,ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థి ఇంటర్వ్యూ దశలో వారి సంబంధిత విభాగంలో కనీస స్థాయి అర్హత సాధించవలసి ఉంటుంది. ఈ ఇంటర్వ్యూలో UR/EWS- అభ్యర్థులు 50 మార్కులు, OBC- 45 మార్కులు, SC/ST/PwBD-40 మార్కులు సాధించాలి. ఇంటర్వ్యూ మొత్తం100 మార్కులకు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు..

అభ్యర్థులందరికీ దరఖాస్తు రుసుము రూ.25లు. వికలాంగ అభ్యర్థులు/ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు ఉండదు. SBI ఏదైనా బ్రాంచ్‌లో నగదు ద్వారా లేదా ఏదైనా బ్యాంకు నెట్ బ్యాంకింగ్ ద్వారా గానీ,  వీసా/మాస్టర్/రూపే/క్రెడిట్/డెబిట్ కార్డ్/UPI ద్వారా గానీ ఫీజు చెల్లించవచ్చు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు UPSC అధికారిక వెబ్‌సైట్‌ను చూడవచ్చు.