జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చి హైదరాబాద్ లో పని చేస్తున్న యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుల్షన్‌నగర్‌లో బ్యాంక్ ఆఫ్ అమెరికాలో శాంపిల్ ఎగ్జిక్యూషన్ అనలిస్ట్‌గా పనిచేస్తున్న 23 ఏళ్ల యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఇరామ్ నబీ దార్ జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని మలపోరా గ్రామస్తురాలు. హైదరాబాద్ లోని ఓ అపార్ట్ మెంట్ లో ఉంటూ ఉద్యోగం చేసుకుంటోంది.
నవంబర్ నుంచి యువతి ఆఫీస్ కు రావడం లేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది. దీంతో ఆఫీస్ వాళ్లు పోలీసులకు కంప్లెయింట్ ఇచ్చారు. పోలీసులు ఆమె ఉండే ఇంటికి వెళ్లి చూడగా.. లోపలి నుంచి డోర్ లాక్ చేసి ఉంది. పోలీసులు తలుపు పగలగొట్టి చూడగా.. ఇరామ్ నబీ దార్ సూసైడ్ చేసుకొని ఉంది. గతకొన్ని రోజులుగా ఆమె బాయ్‌ఫ్రెండ్‌తో గొడవలు జరుగుతున్నట్లు.. ఆకారణంగా ఆత్యహత్య చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆమెకు లవ్ ఎఫైర్ ఉందని, కొంత కాలంగా మానసికంగా బాధ పడుతుందని బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు.
నవంబర్ 8న హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్, పేట్‌బషీరాబాద్‌లో మరో 25 ఏళ్ల యువతి కూడా ఆత్మహత్య చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువతికి కొన్నిరోజుల క్రితం మ్యారేజ్ అయ్యింది. పెళ్లైయాక హైదరాబాద్ లో ఉంటున్నారు.