
తెలంగాణలో బెట్టింగ్ ల బారిన పడిన చాలా మంది యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. బీటెక్,ఎంటెక్ విద్యార్థులు కూడా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇటీవలే హైదరబాద్ జేఎన్టీయూలో ఎంటెక్ చదువుతున్న పవన్ ఆన్ లైన్ బెట్టింగ్ లలో డబ్బుులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.. లేటెస్ట్ గా హైదరాబాద్ మియాపూర్ లో క్రికెట్ బెట్టింగ్ కు యువకుడు బలయ్యాడు.
MA నగరంలో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్న గణేష్(26) ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకున్నాడు. ల్యాబ్ టెక్నిషియన్ గా పనిచేస్తున్న గణేష్ .. క్రికెట్ బెట్టింగ్ కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్టు స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.