వచ్చే నెల హైసియా గ్లోబల్ ఏఐ సమ్మిట్ : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

వచ్చే నెల హైసియా గ్లోబల్ ఏఐ సమ్మిట్ : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

హైదరాబాద్, వెలుగు :  నగరంలో సెప్టెంబర్ 5, 6 తేదీల్లో తెలంగాణ ప్రభుత్వం,  హైదరాబాద్​ సాఫ్ట్‌‌‌‌వేర్ ఎంటర్​ప్రైజెస్ (హైసియా)తో కలసి గ్లోబల్ ఏఐ సదస్సును నిర్వహించనున్నట్టు  రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు.  హైద‌‌‌‌రాబాద్ న‌‌‌‌గ‌‌‌‌రాన్ని ప్రపంచ ఏఐ రాజ‌‌‌‌ధానిగా నిల‌‌‌‌బెట్టే ల‌‌‌‌క్ష్యంతో ఈ స‌‌‌‌ద‌‌‌‌స్సు నిర్వహిస్తున్నామని తెలిపారు.  పరిశ్రమ నాయకులు, విధానకర్తలు

ఆవిష్కర్తల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ లక్ష్యాలను సాధించేందుకు తెలంగాణ రెడీగా ఉందని అన్నారు. త్వరలో ఏర్పాటు చేయబోయే స్కిల్​యూనివర్సిటీ, ఏఐ సిటీ లాంటి రాష్ట్ర కార్యక్రమాలకు ఐటీ ఇండస్ట్రీ కూడా సహకరించాలని మంత్రి శ్రీధర్ బాబు కోరారు.