
హైదరాబాద్, వెలుగు: మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడాన్ని ఈజీగా మార్చేందుకు ఆన్‌లైన్ స్టాక్ బ్రోకింగ్ అప్‌స్టాక్స్ కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ‘ఇన్వెస్ట్ మోడ్’ కింద తక్కువ ఖర్చు అయ్యే మ్యూచువల్ ఫండ్స్‌ను, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) ను అందిస్తోంది. షేర్లలో ఈజీగా ఇన్వెస్ట్ చేసుకునే వెసులుబాటు కలిపిస్తోంది. ‘ప్రో లేదా ట్రేడ్’ మోడ్‌లో ట్రేడింగ్‌ను ఈజీగా మారుస్తోంది. చార్ట్స్, రియల్ టైమ్ ఇన్‌ఫర్మేషన్ వంటివి అందుబాటులో ఉంచుతూ ఆప్షన్ ట్రేడింగ్‌ను సులభంగా మారుస్తోంది. ప్రస్తుతం అప్‌స్టాక్స్ కస్టమర్ల బేస్ 1.10 కోట్ల మంది అని కంపెనీ సీఈఓ రవి కుమార్ పేర్కొన్నారు.
ఇందులో 10–15 శాతం మంది యాక్టివ్‌గా ఉన్నారని చెప్పారు. 2022–23 లో రూ. వెయ్యి కోట్ల టర్నోవర్ మార్క్‌ను టచ్ చేశామని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రాఫిట్‌లోకి వస్తామని అన్నారు. 2030 నాటికి 10 కోట్ల మంది కస్టమర్లను యాడ్ చేసుకోవడమే తమ టార్గెట్ అని వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి తమ కస్టమర్లు పెరుగుతున్నారని, గత రెండేళ్లలో ఈ రాష్ట్రాల్లో 13 శాతం గ్రోత్ నమోదు చేశామని రవి అన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లోని తమ కస్టమర్లలో 70 శాతం మంది జెన్ జెడ్ నుంచే ఉన్నారని వివరించారు. ఇంకా దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఈ రెండు రాష్ట్రాల్లోని తమ కస్టమర్లు ఎక్కువగా ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఇన్వెస్టింగ్‌పై ప్రజల్లో అవగాహన కలిపించేందుకు సెషన్లు, స్పెషల్ క్లాస్‌లను నిర్వహిస్తున్నామని అన్నారు.