గత ప్రభుత్వం దుబారా ఖర్చు చేసింది: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

200 యూనిట్ల వరకు జీరో బిల్..  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

200 యూనిట్ల వరకు ఎవరైతే కరెంటు వాడుతారో వారందరికీ ఫ్రీ కరెంటు ఇస్తం.. ఎలాంటి ఆంక్షలు విధించడం లేదు. ఇంటింటికీ జీరో బిల్లు వస్తది.. అర్హత కలిగిన వారెవరైనా సరే.’ అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆరు గ్యారెంటీల్లో  భాగంగా ఇవాళ రెండు పథకాలు ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే రెండు ప్రారంభించామని గుర్తు చేశారు. అలవి కాని హామీలంటూ తాము అధికారంలోకి వచ్చిన మరుసటి  రోజు  నుంచి బీఆర్ఎస్ లీడర్లు ప్రచారం మొదలు పెట్టారన్నారు.  అనేక ఆర్థిక ఇబ్బందులు అధిగమించి గాడిన  పెట్టే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.  గత ప్రభుత్వం చేసిన దుబారా ఖర్చులు తగ్గించి పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు.

ALSO READ :- Shreyas Iyer: మనసు మార్చుకున్న అయ్యర్.. రంజీ సెమీస్‪కు సిద్ధం