నిజామాబాద్లో ఘనంగా ఊర పండగ నిజామాబాద్ నగరంలో ఆదివారం ఊర పండగ ఘనంగా జరిగింది. ఉదయం 6 గంటల నుంచే ఖిల్లాలోని తేలుగద్దె వద్ద అమ్మవారిని దర్శించుకునేందుకు జనాలు పోటెత్తారు.
పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివేకానంద చౌరస్తా వద్ద అమ్మవారి సరి కోసం జనం ఎగబడ్డారు.
వెలుగు ఫొటోగ్రాఫర్, నిజామాబాద్