అధికారపార్టీ లీడర్లు కబ్జా చేసిన భూములను పేదలకు పంచుతాం : ధన్​పాల్​ సూర్యనారాయణ

నిజామాబాద్​అర్బన్, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే అధికార పార్టీ లీడర్లు కబ్జాలు చేసిన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకొని పేదలకు పంచుతామని అర్బన్​ బీజేపీ అభ్యర్థి ధన్​పాల్​ సూర్యనారాయణ పేర్కొన్నారు. గురువారం నగరంలోని 10వ డివిజన్​లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ధన్ పాల్​ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే బిగాలతో పాటు అధికార పార్టీ లీడర్లు నగరంలోని కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను చెరబట్టారని, ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడుతూ దౌర్జన్యాలు చేశారని విమర్శించారు.

నాగారంలో నిర్మించిన వందలాది డబుల్​బెడ్​రూమ్​ ఇండ్లను ఇంత వరకు పంచలేదని, ఇప్పుడు ఎన్నికలు రావడంతో పేదలకు ఇండ్లిస్తామని మాయమాటలు చెప్తున్నారన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడగానే పేదలకు పక్కా ఇండ్లు నిర్మిస్తామని, ఎలాంటి అక్రమాలు, అవకతవకలు లేని పారదర్శకమైన పాలన అందిస్తామని భరోసా ఇచ్చారు. 

ALSO READ: కాంగ్రెస్ వైపు ప్రజలు.. కమీషన్ల వైపు కేసీఆర్ : జీ. వివేక్ వెంకటస్వామి