కొత్త హంగులతో అర్బన్ క్రూయిజర్ హైరైడర్

కొత్త హంగులతో అర్బన్ క్రూయిజర్ హైరైడర్

అర్బన్ ​క్రూయిజర్ ​హైరైడర్‎ను కొత్త ఫీచర్లతో తీసుకు వచ్చినట్టు టొయోటా కిర్లోస్కర్ ​మోటార్​(టీకేఎం) ప్రకటించింది. అన్ని వేరియంట్లలో 6 ఎయిర్​బ్యాగ్స్, ఎలక్ట్రిక్​ పార్కింగ్​ బ్రేక్​ ఉంటాయి. అర్బన్​ క్రూయిజర్​ హైరైడర్ ఆరు గేర్ల ఇంజన్, 8–వే  అడ్జస్టబుల్ పవర్​ డ్రైవర్​ సీటుతో వస్తుంది. టైర్​ ప్రెజర్ మానిటరింగ్ ​సిస్టమ్, టైప్​ సీ చార్జింగ్ ​పోర్టులు, రీడింగ్​ ల్యాంప్స్, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్​డిస్​ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. ధర రూ.11.34 లక్షల (ఎక్స్​షోరూమ్​) నుంచి మొదలవుతుంది.