లగచర్ల దాడిలో వెంకట్ రెడ్డికి తీవ్ర గాయాలు

  • విరిగిన వేళ్లు, దెబ్బతిన్న చెవి

ఎల్బీనగర్, వెలుగు: వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి ఘటనలో కొడంగల్ అర్బన్ డెవలప్​మెంట్​అథారిటీ స్పెషల్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి కుడి చెవి ఎయిర్ డ్రమ్ దెబ్బతిన్నది.  దీంతో ఆయన చెవులు సరిగ్గా వినబడడం లేదు. వెంకట్ రెడ్డి ఎడమ చేతి చిటికెన వేలు, ఉంగరపు వేలు విరిగిపోవడంతోపాటు మోకాళ్లు, మోచేతులకు తీవ్ర గాయాలయ్యాయి. కర్రలతో కొట్టడంతో వెంకట్ రెడ్డి వీపు, తొడలు కమిలిపోయాయి.

ఆయనకు మొదట కొడంగల్​లో ట్రీట్​మెంట్​చేయించి, తర్వాత హైదరాబాద్​లోని దవాఖానలో చేర్చారు. రెండు రోజుల పాటు చికిత్స పొందిన ఆయన డిశ్చార్జ్ అయ్యి బుధవారం ఇంటికి చేరుకున్నారు. 15 రోజుల వరకు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు సమాచారం.