రాహుల్ గాంధీ వ్యాఖ్యలు అభ్యంతరకరం : ధన్​పాల్ సూర్యనారాయణ 

రాహుల్ గాంధీ వ్యాఖ్యలు అభ్యంతరకరం : ధన్​పాల్ సూర్యనారాయణ 
  •     అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ 

నిజామాబాద్​, వెలుగు : హిందూ జాతినుద్దేశించి పార్లమెంట్​లో కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ కామెంట్స్​ తీవ్ర అభ్యంతరకమైనవని అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ అన్నారు. హింసకు పాల్పడతారని అసత్యం, ద్వేషం రెచ్చగొడతారని ఆయన చేసిన వ్యాఖ్యలు దారుణమన్నారు. మంగళవారం ఆయన మీడియాకు ప్రకటన రిలీజ్​ చేశారు.  పదేండ్లు ప్రతిపక్ష హోదా లేక మొన్నటి ఎన్నికల్లో వంద సీట్లు గెలవని రాహుల్​ మతిలేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.  

హిందువుల ఏండ్ల కల నెరవేరి అయోధ్యలో రామమందిర పున:ప్రతిష్టాపన ప్రొగ్రాం జరగ్గా.. దానికి ఆయన అటెండ్​ కాలేదన్నారు. ఆఫ్ఘనిస్తాన్లోని బాబా సమాధి చూడడానికి మాత్రం సమయం తీసుకొని వెళ్లారన్నారు.  సీఎం రేవంత్​రెడ్డి కూడా ఓ వర్గం ఓట్ల కోసం చెప్పలేని ప్రేమ ఒలకబోస్తున్నారని ఆరోపించారు. సెంట్రల్​ గవర్నమెంట్​ నిషేధించిన జమాతె ఇస్లామీ సంస్థ వికారాబాద్​లో ఏర్పాటు చేసిన ప్రోగ్రాంకు రూ.2 కోట్ల నిధులు ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. ​

దేశ విచ్చినాన్ని కాంగ్రెస్​ కోరుకుంటోందని బీజేపీ పార్టీ కార్యకర్తలతో భూమాతను కాపాడుకుంటామన్నారు. పార్లమెంట్​లో రాహుల్​ హిందువులను ఉద్దేశించి చేసిన కామెంట్​, ఎంఐఎం అధినేత అసదుద్దీన్​ ఓవైసీ పార్లమెంట్​లో  జై పాలస్తీనా అనడాన్ని  దేశ ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు.