అప్పుడే 20 జిల్లాల్లో యూరియా నోస్టాక్

యూరియా నో స్టాక్

యాసంగిలో రాష్ట్రానికి10 లక్షల టన్నులు కేటాయింపు

కేంద్రం పంపినా ఇంకా రాష్ట్రానికి చేరలే
త్వరగా తెప్పించుకోవడంపై దృష్టిపెట్టని అధికారులు
ఇప్పటిదాకా వచ్చింది 4.82 లక్షల టన్నులే

హైదరాబాద్, వెలుగు: యాసంగి సీజన్ లో రాష్ట్రానికి కేటాయించిన యూరియాలో ఇంకా సగం కూడా రాలే. ఈ సీజన్ లో 10 లక్షల టన్నుల యూరియాను కేంద్రం కేటాయించి, ఆ మేరకు రిలీజ్ చేసినా.. ఇప్పటిదాకా 4.82 లక్షల టన్నుల యూరియా మాత్రమే వచ్చింది. ఇంకా లక్షలాది టన్నుల యూరియా ట్రాన్సిట్ లోనే ఉంది. ప్రస్తుతం రాష్టంలో 3.23 లక్షల టన్నుల యూరియా స్టాకే ఉంది. నాట్లు ఊపందుకుని డిమాండ్ పెరిగితే యూరియా కొరత తీవ్రమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే ట్రాన్సిట్ పాయింట్ల నుంచి యూరియాను త్వరగా తెప్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

డిసెంబర్‌‌లో 82 వేల టన్నులే..

కేంద్రం కేటాయింపుల ప్రకారం డిసెంబర్ లో రాష్ట్రానికి 1.51 లక్షల టన్నుల యూరియా రావాల్సి ఉండగా, 82 వేల టన్నులు మాత్రమే వచ్చింది.  ట్రాన్సిట్‌‌‌‌‌‌‌‌ కేంద్రాల నుంచి ఇంకా లక్షలాది టన్నుల యూరియా రావాల్సి ఉంది. యూరియా అమ్మకాలు జోరందుకుంటే ఇప్పడున్న నిల్వలు ఏమాత్రం సరిపోయే పరిస్థితి లేదు. అయితే నిరుడు ఈ టైమ్ కు 72,989 టన్నుల ఎరువులు సేవల్ కాగా, నిల్వలు తక్కువగా ఉండటంతో ఈ యేడు 20 వేల టన్నులు తక్కువగా, 52,473 టన్నుల ఎరువులు మాత్రమే సేల్ అయ్యాయి.

స్టాక్‌‌‌‌‌‌‌‌ 3.23 లక్షల టన్నులే..

రాష్ట్రవ్యాప్తంగా డీలర్లు, సహకార సంఘాలు, మార్క్‌‌‌‌‌‌‌‌ఫెడ్‌‌‌‌‌‌‌‌లలో అంతా కాలిపి 3.23 లక్షల  టన్నుల యూరియా మాత్రమే స్టాక్‌‌‌‌‌‌‌‌ ఉన్నది. డీలర్ల వద్ద 75 వేల టన్నుల టన్నుల యూరియా ఉంది.  గ్రామాల్లో సోసైటీల వద్ద యూరియా ఎక్కువగా ఉండాల్సి ఉండగా, 31 వేల టన్నుల నిల్వలు మాత్రమే  ఉన్నాయి. కంపెనీ గోదాముల వద్ద17 వేల టన్నులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.  మార్క్‌‌‌‌‌‌‌‌ఫెడ్‌‌‌‌‌‌‌‌ వద్ద బఫర్‌‌‌‌‌‌‌‌ స్టాక్‌‌‌‌‌‌‌‌ 5 లక్షల టన్నుల వరకు ఉండాల్సి ఉండగా, 2 లక్షల టన్నుల వరకే స్టాక్‌‌‌‌‌‌‌‌ ఉంది.

డీఏపీ 36 వేల టన్నులే

రాష్ట్రంలో డీఏపీ స్టాక్ 36 వేల టన్నులే సిద్ధంగా ఉన్నది. డీలర్ల వద్ద17 వేల టన్నులు, సొసైటీల వద్ద 6 వేల టన్నులు, మార్క్‌‌‌‌‌‌‌‌ఫెడ్‌‌‌‌‌‌‌‌ వద్ద11 వేల టన్నులు, కంపెనీ గోదాముల్లో 2 వేల టన్నుల డీఏపీ మాత్రమే అందుబాటులో ఉంది. నత్రజని, పాస్పరస్‌‌‌‌‌‌‌‌, పొటాషియం నిల్వలు బాగానే ఉన్నాయి. అయితే ఏంఓపీ, ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌పీ నిల్వలు డీలర్ల వద్ద7 వేల టన్నుల వరకు ఉండగా సోసైటీలు, మార్క్‌‌‌‌‌‌‌‌ఫెడ్‌‌‌‌‌‌‌‌ వద్ద అసలు స్టాకే లేదు.

20 జిల్లాల్లో నో స్టాక్

కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్‌‌‌‌‌‌‌‌ రూరల్‌‌‌‌‌‌‌‌, జగిత్యాల, సంగారెడ్డి, నిర్మల్‌‌‌‌‌‌‌‌, వరంగల్‌‌‌‌‌‌‌‌ అర్బన్‌‌‌‌‌‌‌‌, సిద్దిపేట, జనగాం, వనపర్తి, మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌, రాజన్న సిరిసిల్ల, మెదక్‌‌‌‌‌‌‌‌, వికారాబాద్‌‌‌‌‌‌‌‌, కుమ్రంభీమ్‌‌‌‌‌‌‌‌, యాదాద్రి, నాగర్‌‌‌‌‌‌‌‌ కర్నూల్‌‌‌‌‌‌‌‌, నారాయణపేట్‌‌‌‌‌‌‌‌, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని కంపెనీ గోదాముల్లో స్టాక్ లేదు. మొత్తంగా గోదాముల్లో యూరియా17 వేల టన్నుల స్టాక్‌‌‌‌‌‌‌‌ మాత్రమే ఉందని చెప్తున్నారు.

త్వరలో వస్తది: అధికారులు

నిజామాబాద్‌‌‌‌‌‌‌‌, కరీంనగర్‌‌‌‌‌‌‌‌, ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌కు రావాల్సిన 6 వేల టన్నుల యూరియా రేక్‌‌‌‌‌‌‌‌లు ఇంకా కాకినాడ, జైగఢ్ పోర్టుల్లోనే ఉన్నాయి. గద్వాల, వరంగల్‌‌‌‌‌‌‌‌, మిర్యాలగూడ, నిజామబాద్‌‌‌‌‌‌‌‌, ఖమ్మంకు రావాల్సిన12వేల టన్నుల యూరియా కాకినాడ పోర్టు నుంచి రావాల్సి ఉంది. కొన్ని ప్రాంతాల్లో లోడింగ్‌‌‌‌‌‌‌‌ దశలో ఉండగా కొన్ని ప్రాంతాల నుంచి  రైళ్లద్వారా రవాణా జరుగుతోంది. ఎన్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌, ఐపీఎల్‌‌‌‌‌‌‌‌, సీఐల్‌‌‌‌‌‌‌‌, ఇఫ్‌‌‌‌‌‌‌‌కో, కంపెనీలకు చెందిన యూరియా లోడింగ్‌‌‌‌‌‌‌‌ దశలో ఉన్నది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చేరాల్సిన యూరియా ట్రాన్సిట్‌‌‌‌‌‌‌‌ కేంద్రాల నుంచి రవాణా దశలో ఉందని, త్వరలోనే వస్తుందని అధికారులు  చెబుతున్నారు.

For More News..

క్రికెట్‌ను వదిలి.. వరల్డ్​లోనే రిచెస్ట్​​ బ్యాంకర్ మారి..‌