
బాల్కొండ, వెలుగు : యూరియా కొరత వల్ల అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. గురువారం బాల్కొండ సొసైటీలో ఎదుట రైతులు భారీ క్యూ కట్టారు. ఉదయం నుంచి పడిగాపులు కాయగా, 200 బస్తాలు మాత్రమే రైతులు ఎగబడ్డారు. ప్రభుత్వం స్పందించి సరిపడా యూరియా సరఫరా చేయాలని అన్నదాతలు కోరారు.