కాజీపేట/వరంగల్, వెలుగు : హనుమకొండ జిల్లా కాజీపేటలోని హజరత్ సయ్యద్‌షా అఫ్జల్ బియాబానీ దర్గా ఉర్సుకు గురువారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఛాదర్ ఏ గుల్ కార్యక్రమంలో భాగంగా ముస్లింలు వివిధ దర్గాల నుంచి జెండాలు తీసుకొచ్చి కాజీపేట దర్గాలో సమర్పించారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ హనుమకొండలోని పార్టీ ఆఫీస్ నుంచి కాజీపేట దర్గా వరకు ర్యాలీగా వచ్చి ఛాదర్ సమర్పించారు. అలాగే వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ దర్గాను సందర్శించి ప్రార్థనలు చేశారు.