![ఊరు పేరు భైరవకోన చిత్రం ఫిబ్రవరి 16న విడుదల](https://static.v6velugu.com/uploads/2024/02/uru-peru-bhairavakona-movie-releasing-on-february-16_GK2s0AvrgQ.jpg)
‘ఊరు పేరు భైరవకోన’ చిత్రంలో బలమైన పాత్రలో నటించానని చెప్పింది హీరోయిన్ వర్ష బొల్లమ్మ. సందీప్ కిషన్ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో రాజేష్ దండా నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 16న విడుదలవుతోంది. ఈ సందర్భంగా వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ ‘ఇదొక సూపర్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ. విఐ ఆనంద్ కథ చెప్పినప్పుడు చాలా కొత్తగా అనిపించింది.
ఇందులో భూమి అనే గిరిజన అమ్మాయిగా కనిపిస్తా. భైరవకోనలో తనొక్కతే చదువుకున్న అమ్మాయి. తప్పుని నిలదీసే ధైర్యం ఉన్న పాత్ర. నాకొక యాక్షన్ సీన్ కూడా ఉంటుంది. సందీప్ కిషన్ గ్రేట్ కో స్టార్. మంచి హ్యూమన్ బీయింగ్. ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ మాట్లాడతారు. విఐ ఆనంద్‌తో వర్క్ చేయడం చాలా ఎక్సైటింగ్‌గా అనిపించింది. నాకోసం బలమైన పాత్ర రాయడం హ్యాపీ.
సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ ఉన్న ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ని ఇస్తుంది. అలాగే ఇందులో మంచి మెసేజ్ కూడా ఉంది. ఇక ప్రస్తుతం మంచి ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నా. దాని గురించి త్వరలోనే నిర్మాతలు అనౌన్స్ చేస్తారు. నిడివి తక్కువ ఉన్నప్పటికీ కథలో ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేయడానికే ఇష్టపడతా’ అని చెప్పింది.