వారం రోజులుగా ICUలో చికిత్స.. తుది శ్వాస విడిచిన ఫుట్‌బాలర్

వారం రోజులుగా ICUలో చికిత్స.. తుది శ్వాస విడిచిన ఫుట్‌బాలర్

గత వారం రోజులుగా ఆస్పత్రి బెడ్‌పై కొన ఊపిరితో కొట్టుమిట్టాడిన ఉరుగ్వే ఫుట్‌బాల్ ప్లేయర్ జువాన్ ఇజ్క్విర్డో(27) తుది శ్వాస విడిచారు. మరణాన్ని అతను ప్రాతినిథ్యం వహిస్తున్న ఉరుగ్వే క్లబ్ నేషనల్ ద్రువీకరిచింది. ఇజ్క్విర్డో మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన యాజమాన్యం.. అతని లేని జట్టును ఊహించుకోలేకపోతున్నామని ప్రకటన చేసింది.

ALSO READ | సిరాజ్ అవుట్.. నవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైనీ ఇన్

ఆగష్టు 23న సావో పాలోతో జరిగిన మ్యాచ్‌లో క్లబ్ నేషనల్ డిఫెండర్ జువాన్ ఇజ్క్విర్డో అకస్మాత్తుగా మైదానంలో కింద పడిపోయాడు. ఆట 84వ నిమిషంలో అతను ఎవరి ప్రమేయం లేకుండానే నిల్చున్న చోటనే కుప్పకూలాడు. వెంటనే స్పందించిన సిబ్బంది హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుండి ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ అతన్ని కాపాడలేకపోయారు. మంగళవారం అతను తుది శ్వాస విడిచారు.

"ప్రియమైన ఆటగాడు జువాన్ ఇజ్క్విర్డో మరణం మాకు తీరని లోటు. అతను లేని ప్రపంచం బోసిపోయినట్లుగా ఉంది. అతని కుటుంబం, స్నేహితులు, సహోద్యోగులు, ప్రియమైన వారికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం.." అని క్లబ్ నేషనల్ సోషల్ మీడియా హ్యాండిల్ లో పోస్ట్ చేసింది.