బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా అఖిల్ నటించిన ఏజెంట్ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. సురేందర్ డైరెక్షన్ చేసిన ఈ మూవీ ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీ షూటింగ్ సమయంలో అఖిల్ అక్కినేని, ఊర్వశీ రౌతేలాను వేధించాడంటూ బాలీవుడ్ క్రిటిక్స్ ఉమైర్ సంధు ఏప్రిల్ 18న తన పోస్ట్ చేసిన ట్వీట్ దేశ వ్యాప్తంగా దుమారం రేపింది.
దీనిపై లేటెస్ట్ గా స్పందించిన ఊర్వశీ రౌతేలా ఉమైర్ సంధుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యక్తి పెట్టిన పోస్టులను నమ్మొద్దని అఖిల్ వేధించాడని చేసిన పోస్టులో వాస్తవం లేదన్నారు. అతడిపై తన లీగల్ టీం పరువు నష్టం దావా వేసిందని తెలిపారు. ఇలాంటి పనికి రాని వల్ల తాను తన కుటుంబం ఇబ్బందిపడాల్సి వస్తోందన్నారు.
https://twitter.com/UrvashiRautela/status/1650053569897439233
ఇంతకీ ఉమైర్ సంధు ఏమన్నాడంటే.. యూరప్ లో జరిగిన ఏజెంట్ సాంగ్ షూటింగ్ లో అకిల్ అక్కినేని ఊర్వశీ రౌతేలాను వేధించాడని ట్వీట్ చేశాడు. అఖిల్ మెచ్చూరిటీ లేని నటుడని.. అతడితో నటించడానికి చాలా అసౌకర్యంగా ఫీలవుతున్నట్లు ఊర్వశీ చెప్పిందని ఉమైర్ సంధు ట్వీట్ చేశాడు.
https://twitter.com/UmairSandu/status/1648312663389159426