
ఈ సంక్రాంతికి ‘దబిడి దబిడి’ అంటూ బాలకృష్ణ సరసన స్పెషల్ సాంగ్‌తో అలరించిన ఊర్వశీ రౌతేలా.. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్‌తో ఆడి పాడింది. సన్నీ డియోల్ హీరోగా గోపీచంద్ మలినేని రూపొందిస్తున్న హిందీ చిత్రం ‘జాట్’లో ఊర్వశీ స్పెషల్ సాంగ్ చేసింది.
‘టచ్ కియా’ అంటూ సాగే హిందీ పాటను బుధవారం (April 2) విడుదల చేశారు. ఇందులో ఊర్వశీ చేసిన డ్యాన్స్ మూమెంట్స్ యూత్‌ను అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి. తమన్ కంపోజ్ చేయగా, కుమార్ క్యాచీ లిరిక్స్ అందించాడు. మధుబంతి బాగ్చి, షాహిద్ మాల్యా పాడిన విధానం ఆకట్టుకుంది.
ఇందులో రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్, సయామి ఖేర్, రెజీనా ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్, టీజీ విశ్వ ప్రసాద్, ఉమేష్ కుమాన్ బన్సాల్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది.