Touch Kiya: జానీ కొరియోగ్రఫీలో ‘టచ్‌ కియా’.. దబిడి దిబిడి తర్వాత ఊర్వశీ మరో ఐటమ్ సాంగ్

Touch Kiya: జానీ కొరియోగ్రఫీలో ‘టచ్‌ కియా’.. దబిడి దిబిడి తర్వాత ఊర్వశీ మరో ఐటమ్ సాంగ్

డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన జాట్ (JAAT)మూవీ ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో జాట్ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. టచ్ కియా (Touch Kiya)అంటూ సాగే ఈ పాట ఇపుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా దబిడి దిబిడి సాంగ్ తర్వాత, ఈ టచ్ కియా రావడం అంచనాలు పెంచేసింది. అంతేకాకుండా చాలా గ్యాప్ తర్వాత జానీ కొరియోగ్రఫీలో హై-ఎనర్జీ డ్యాన్స్ నెంబర్ రావడంతో స్పెషల్ గా నిలిచింది. ఈ పాటకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అదిరిపోయే ట్యూన్ కంపోజ్ చేశాడు. కుమార్ సాహిత్యం అందించగా, మధుబంటి బాగ్చి మరియు షాహిద్ మాల్యా పాడారు. 

దబిడి దిబిడి సాంగ్తో ఊర్వశీ రౌతేలా మరింత ఫేమస్ అయింది. శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యాయి. ఇప్పటికే ఊర్వశీ టాలీవుడ్ లో సూపర్ హిట్ ఐటెం సాంగ్స్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన వాల్తేరు వీరయ్యలోని వేర్ ఈజ్ ది పార్టీ సాంగ్ గుర్తుంది కదా. ఆ పాటలో మెగాస్టార్ పక్కన గ్లామర్ వలకబోసింది ఈ బ్యూటీనే. అంతేకాదు బ్రో సినిమాలో పవన్ పక్కన, స్కంద సినిమాలో రామ్ పక్కన కూడా చిందేసింది ఈ బ్యూటీ. ఇక బాలకృష్ణతో చేసిన దబిడి దిబిడి అయితే, వైరల్ చేసేసింది. ఇక ఇప్పుడు టచ్ కియాతో ఎలాంటి టాక్ తెచ్చుకోనుందో చూడాలి. 

బాలీవుడ్ సూపర్ స్టార్ సన్నీ డియోల్ హీరోగా పవర్‌ఫుల్ యాక్షన్ ప్యాక్‌డ్ మూవీగా జాట్  రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళంలోనూ రిలీజ్ కాబోతోంది.