ఐపీఎల్ లో భారత యువ క్రికెటర్ కు నిరాశ మిగిలింది. ఐపీఎల్ లో ఏ జట్టు కూడా అతన్ని తీసుకోవడానికి ఆసక్తి చూపించలేదు. కట్ చేస్తే ఇప్పుడు ఆ ప్లేయర్ 28 బంతుల్లోనే సెంచరీ కొట్టి ప్రపంచ క్రికెట్ ను ఆశ్చర్యపరిచాడు. అతని పేరు ఉర్విల్ పటేల్. గుజరాత్ కు చెందిన ఈ యువ క్రికెటర్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సంచలన ఇన్నింగ్స్ తో మెరిశాడు. 28 బంతుల్లో సెంచరీ చేసి టీ20 క్రికెట్‌లో వేగవంతమైన సెంచరీ చేసిన భారత క్రికెటర్ గా నిలిచాడు.
ఇండోర్‌లోని ఎమరాల్డ్ హైట్స్ ఇంటర్నేషనల్ స్కూల్ గ్రౌండ్‌లో బుధవారం (నవంబర్ 27)త్రిపురపై అతను ఈ ఫీట్ సాధించాడు. 28 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న ఈ గుజరాత్ ఆటగాడు 35 బంతుల్లో 7 ఫోర్లు, 12 సిక్సర్లతో అజేయంగా 113 పరుగులు చేశాడు. అంతకముందు భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ పేరిట ఫాస్టెస్ట్ రికార్డ్ ఉంది. అతను 2018లో అరుణ్ జైట్లీ స్టేడియంలో హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ తరపున 32 బంతుల్లో సెంచరీ చేశాడు.
Also Read : ఒలింపిక్స్ పతక విజేత భజరంగ్ పునియాపై నాలుగేళ్ల సస్పెన్షన్
ఓవరాల్ గా టీ20 క్రికెట్ చరిత్రలో ఇది రెండో వేగవంతమైన సెంచరీ. ఈ ఏడాది ప్రారంభంలో సైప్రస్‌పై ఎస్టోనియా ఆటగాడు సాహిల్ చౌహాన్ 27 బంతుల్లో సెంచరీ చేశాడు. ఒక్క మూడు రోజులు ముందు ఆడి ఉంటే అతనికి ఐపీఎల్ మెగా ఆక్షన్ లో కోట్లు పలికేవి. ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఉర్విల్ పటేల్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడడంతో.. గుజరాత్ 156 పరుగుల లక్ష్యాన్ని 58 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.
అత్యంత వేగవంతమైన టీ20 సెంచరీలు
సాహిల్ చౌహాన్ - 27 బంతులు - 2024లో ఎస్టోనియా వర్సెస్ సైప్రస్
ఉర్విల్ పటేల్ - 28 బంతులు - 2024లో గుజరాత్ వర్సెస్ త్రిపుర
క్రిస్ గేల్ - 30 బంతులు - 2013లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పూణే వారియర్స్ ఇండియా
రిషబ్ పంత్ - 32 బంతులు - 2018లో ఢిల్లీ వర్సెస్ హిమాచల్ ప్రదేశ్
🚨 URVIL PATEL CREATED HISTORY 🚨
— Johns. (@CricCrazyJohns) November 27, 2024
Urvil Patel smashed Hundred from just 28 balls in Syed Mushtaq Ali, fast hundred by an Indian in T20 history, breaking the record of Rishabh Pant 🙇
- Urvil Patel, WK batter was unsold in the auction. pic.twitter.com/K0Ju13pKFY