SMAT: వేలంలో అమ్ముడుపోని భారత క్రికెటర్.. వారం వ్యవధిలో రెండు మెరుపు సెంచరీలు

SMAT: వేలంలో అమ్ముడుపోని భారత క్రికెటర్.. వారం వ్యవధిలో రెండు మెరుపు సెంచరీలు

ఐపీఎల్ లో భారత యువ క్రికెటర్ కు నిరాశ మిగిలింది. ఐపీఎల్ లో ఏ జట్టు కూడా అతన్ని తీసుకోవడానికి ఆసక్తి చూపించలేదు. కట్ చేస్తే ఇప్పుడు ఆ ప్లేయర్ 28 బంతుల్లోనే సెంచరీ కొట్టి ప్రపంచ క్రికెట్ ను ఆశ్చర్యపరిచాడు. అంతే కాదు ఈ సెంచరీ గాలివాటం కాదని నిరూపిస్తూ 36 బంతుల్లోనే సెంచరీ చేసి ఆశ్చర్యపరిచాడు. అతని పేరు ఉర్విల్‌ పటేల్‌. గుజరాత్ కు చెందిన ఈ యువ క్రికెటర్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సంచలన సెంచరీలతో మెరిశాడు. నవంబర్ 27 న 28 బంతుల్లో సెంచరీ చేసి టీ20 క్రికెట్‌లో వేగవంతమైన సెంచరీ చేసిన భారత క్రికెటర్ గా నిలిచాడు.

సరిగా వారం రోజులు గడవకముందే ఎమరాల్డ్ హైస్కూల్ గ్రౌండ్‌లో ఉత్తరాఖండ్‌తో జరిగిన మ్యాచ్ లో ఉర్విల్.. 36 బంతుల్లో సెంచరీ చేయడం విశేషం. పటేల్ ఓవరాల్ గా  41 బంతుల్లో 115 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో ఎనిమిది బౌండరీలు 11  సిక్సర్‌లు ఉన్నాయి. అతని బ్యాటింగ్ ధాటికి 183 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ కేవలం 13.1 ఓవర్లలో ఛేజ్ చేసింది. ఈ సెంచరీతో టీ20 క్రికెట్ చరిత్రలో 40 కంటే తక్కువ బంతుల్లో రెండు సెంచరీలు చేసిన మొదటి బ్యాటర్‌గా నిలిచాడు. 

Also Read:-ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ.. రెండో టెస్టుకు స్మిత్ దూరం..

అంతకముందు ఇండోర్‌లోని ఎమరాల్డ్ హైట్స్ ఇంటర్నేషనల్ స్కూల్ గ్రౌండ్‌లో బుధవారం (నవంబర్ 27)త్రిపురపై ఉర్విల్‌ పటేల్‌ ఈ ఫీట్ సాధించాడు. 28 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న ఈ గుజరాత్ ఆటగాడు 35 బంతుల్లో 7 ఫోర్లు, 12 సిక్సర్లతో అజేయంగా 113 పరుగులు చేశాడు. అంతకముందు భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ పేరిట ఫాస్టెస్ట్ రికార్డ్ ఉంది. అతను 2018లో అరుణ్ జైట్లీ స్టేడియంలో హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ తరపున 32 బంతుల్లో సెంచరీ  చేశాడు.