Viral Video: తల్లి చేతులు జోడించి వేడుకున్నా వదల్లేదు..కొడుకును గన్తో కాల్చారు

ఇద్దరు అగంతకులు..ఇంట్లోకి దర్జాగా ప్రవేశించారు.. గన్ తీశారు... అతని తలకు గురిపెట్టారు..పిల్లలతో సహా ఇంట్లో వారంతా చూస్తుండగానే.. ధన్ ధన్ మని కాల్చారు.. ఆ భయానక దృశ్యాలు చూసిన చిన్నారులు, కుటుంబ సభ్యులు  భయంతో ఏడుస్తూ పరుగులు పెట్టారు..బాధితుడు నేలపై పడిపోగానే ..దుండగులు పారిపోయారు. పంజాబ్ లోని అమృత్ సర్ లోని  శనివారం (ఆగస్టు 24, 2024) ఉదయం ఈ  ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే..  

పంజాబ్ లోని అమృత్ సర్ లోని ఓ గ్రామంలో అమెరికాకు చెందిన సుఖ్ చైన్ సింగ్ ఎన్ ఆర్ ఐపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు గన్ తో కాల్చారు.. సుఖ్ చైన్ సింగ్ ఇంట్లో చొరబడిన దుండగులు కుటుంబ సభ్యులు చూస్తుండగానే అతనిపై దాడి చేశారు. తలకు గన్ గురిపెట్టి కాల్చారు. సుఖ్ చైన్ సింగ్ తల్లి చేతులు జోడించి దండం పెట్టినా వదల్లేదు దుర్మార్గులు. సుఖ్ చైన్ సింగ్ నేల కూలగానే..పారిపోయారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న సుఖ్ చైన్ సింగ్ ను ఆస్పత్రికి తరలించారు. 

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరు తలపాగా కట్టుకున్న వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి సుఖ్ చైన్ సింగ్ పై కాల్పులు జరిపినట్లు అతని ఇంట్లోని సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. ఈ వీడియోలో సుఖ్ చైన్ సింగ్ తల్లి .. చంపొద్దని చేతులు జోడించి దండం పెడుతున్నట్లు కనిపిస్తోంది.. అయినా సరే దుండగులు సుఖ్ చైన్ సింగ్ తలకు గన్ గురిపెట్టి కాల్చిన దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి.  ఘటన జరిగిన వెంటనే సింగ్ ను ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు.. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా నే ఉందని రిపోర్టు చెబుతున్నాయి.