గోల్డ్‌మాన్ శాక్స్ ఎంచుకున్న టాప్-10 స్టాక్స్.. షేర్ల లిస్ట్, వాటి టార్గెట్ ధరలివే..!!

గోల్డ్‌మాన్ శాక్స్ ఎంచుకున్న టాప్-10 స్టాక్స్.. షేర్ల లిస్ట్, వాటి టార్గెట్ ధరలివే..!!

Goldman Sachs: దేశీయ స్టాక్ మార్కెట్లు మూడు నెలల నుంచి తమ తిరోగమనాన్ని కొనసాగించాయి. అయితే గడచిన వారం రోజులుగా గాడిన పడ్డ మార్కెట్లు క్రమంగా పుంజుకుంటున్నాయి. రెండు రోజులుగా ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కోసం ఎగబడటంతో సూచీల్లో లాభాలు ఆవిరయ్యాయి. ఇప్పుడు పరిస్థితులు సాధారణానికి చేరుకోవటంతో ఇన్వెస్టర్లు తిరిగి తమ డబ్బును ఈక్విటీ మార్కెట్లలోకి తీసుకురావటానికి ఇష్టపడుతున్నారు. 

డబ్బులు చేతిలో దండిగా ఉన్నప్పటికీ వేల సంఖ్యలో ఉన్న లిస్టెడ్ షేర్ల నుంచి ఏవి సెలెక్ట్ చేసుకోవాలనే గందరగోళంలో ఉన్న పెట్టుబడిదారులకు ఇక్కడ క్లారిటీ పొందే మార్గం ఒకటి ఉంది. ఎందుకంటే అమెరికాకు చెందిన ప్రముఖ బ్రోకింగ్ హౌస్ గోల్డ్‌మాన్ శాక్స్ భారతీయ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు 10 ఉత్తమ షేర్లను ఎంపిక చేసింది. పైగా సదరు షేర్లకు టార్గెట్ ధరలను ప్రకటించి ఆసక్తి రేపింది. ఇన్వెస్టర్లు ఈ షేర్లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా రానున్న 12 నెలల్లో.. అంటే 2026 మార్చి నాటికి మంచి లాభాలు అందుకుంటారని తన రిపోర్ట్ ద్వారా వెల్లడించింది గోల్డ్ మాన్ శాక్స్.

వివిధ రంగాల్లో ఎంపిక చేయబడిన స్టాక్స్ లిస్ట్.. 

1. ఫైనాన్స్ రంగానికి చెందిన హెచ్డీఎఫ్సీ షేర్లకు రూ.2090 టార్గెట్ ధరగా చెబుతోంది.
2. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్టాక్ టార్గెట్ ధరను 796 రూపాయలుగా అంచనా వేసింది. 
3. కన్జూమర్ కేటగిరీలో వ్యాపారం చేస్తున్న టైటాన్ స్టాక్ టార్గెట్ ధరను 3 వేల 900 రూపాయలుగా అంచనా వేసింది ఆ కంపెనీ.
4. కన్జూమర్ డ్యూరబుల్స్ కేటగిరీలోని జీసీపీఎల్ స్టాక్ టార్గెట్ ధర రూ.1,370గా నిర్ణయించబడింది.
5. అదానీ పోర్ట్స్ కంపెనీ షేర్లకు బ్రోకింగ్ సంస్థ టార్గెట్ ధరను షేరుకు రూ.1,400గా వెల్లడించింది.
6. విమానయాన రంగంలో అగ్రగామి ఆటగాడిగా కొనసాగుతున్న ఇండిగో స్టాక్ టార్గెట్ ధరను రూ.5 వేల 050గా ప్రకటించింది.
7. ట్రావెల్ అండ్ టూరిజం రంగానికి చెందిన కంపెనీ మేక్ మై ట్రిప్ షేర్లకు టార్గెట్ ధరను 124 డాలర్లుగా వెల్లడించింది. (ఇది అమెరికన్ స్టాక్ ఎక్చేంజ్ ట్రేడింగ్ లో)
8. ఆటోమెుబైల్ రంగానికి చెందిన మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ షేర్ల టార్గెట్ ధరను రూ.3 వేల 800గా నిర్ణయించింది.
9. హెల్త్ కేర్ రంగానికి చెంది అపోలో హాస్పిటల్స్ కంపెనీ షేర్లకు బ్రోకరేజ్ టార్గెట్ ధరను రూ.8 వేల 025గా లెక్కించింది.
10. ఇక చివరిగా క్లీన్ ఎనర్జీ రంగానికి చెందిన పవర్ గ్రిడ్ కంపెనీ షేర్లకు టార్గెట్ ధరను రూ.375గా ఉంచింది. 

NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.

ALSO READ | Tax News: వాట్సాప్-గూగుల్ డేటాతో రూ.250 కోట్లు పట్టుకున్న పన్ను అధికారులు.. షాకింగ్