
Cognizant GCC: అమెరికాకు చెందిన ఫైనాన్షియల్ సేవల దిగ్గజం సిటిజన్ ఫైనాన్షియల్ గ్రూప్ తాజాగా హైదరాబాదులో టెక్ కంపెనీ కాగ్నిజెంట్ తో జతకట్టి తన గ్లోబల్ కెపాసిటీ సెంటర్ ఏర్పాటు చేసింది. ఇది హైదరాబాదులోని కాగ్నిజెంట్ క్యాంపస్ లోపలే ఉంటుందని కంపెనీ పేర్కొంది.
వాస్తవానికి ఇదొక ఇన్నోవేషన్ హబ్ మాదిరిగా వర్క్ చేస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ జీసీసీ ఏర్పాటు ద్వారా మార్చి 2026 నాటికి కొత్తగా 1000 హై వ్యాల్యూ కలిగిన ఉపాధి అవకాశాలు కల్పించబడతాయని వెల్లడించాయి. ఈ సెంటర్ బ్యాంకింగ్ సంస్థలకు రానున్న కాలంలో థర్డ్ పార్టీ సంస్థలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని జీసీసీ పేర్కొంది. హైదరాబాద్‌లో దాదాపు 57,000 మంది సిబ్బందిని కలిగి ఉన్న కాగ్నిజెంట్, దాని AI-ఆధారిత ప్లాట్‌ఫారమ్‌లైన న్యూరో, ఫ్లోసోర్స్‌లను ఉపయోగించి సిటిజన్స్ జీసీసీకి అదనపు శక్తిని ఇవ్వనుంది. అలాగే క్లౌడ్, డేటా, సైబర్ సెక్యూరిటీ, ఇంటెలిజెంట్ ఆటోమేషన్ రంగాల్లో భవిష్యత్తు అవసరాలకు తగిన ఉత్పత్తులను కంపెనీ అందించనుంది.
Also Read :- 10 నిమిషాల్లోనే ఎయిర్‌టెల్ సిమ్.. నేరుగా ఇంటికే బ్లింకిట్ డెలివరీ
అమెరికా చెందిన సిటిజన్స్ సంస్థ, కాగ్నిజెంట్ చేతులు కలపటంపై తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తెలంగాణ దేశంలో 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదిగేందుంకు చేస్తున్న ప్రయత్నానికి దోహదపడుతుందని మంత్రి అన్నారు. ప్రస్తుతం బలమైన ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వేగంగా ముందుకు సాగుతోందని ఆయన వెల్లడించారు.
ప్రస్తుతం హైదరాబాద్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగంలో ఆవిష్కరణలకు ప్రపంచ ప్రధాన కార్యాలయంగా మారిందని కాగ్నిజెంట్ ప్రతినిధి నాగేశ్వర్ చెరుకుపల్లి అన్నారు. పైగా అనేక జీసీసీల ఏర్పాటుకు హైదరాబాద్ డెస్టినేషన్ గా మారింది. ప్రస్తుతం హైదరాబాదులో అత్యుత్తమ టాలెంట్ పూల్ అందుబాటులో ఉండటమే ప్రపంచ దేశాలకు చెందిన దిగ్గజ కంపెనీలను ఆకట్టుకోవటానికి కారణంగా నిపుణులు చెబుతున్నారు.