Donation Scam: 200 మంది తెలుగోళ్లను ఉద్యోగం నుంచి పీకేసిన అమెరికా కంపెనీ..!

Donation Scam: 200 మంది తెలుగోళ్లను ఉద్యోగం నుంచి పీకేసిన అమెరికా కంపెనీ..!

Fannie Mae Layoffs: ఎంతో కష్టపడి వీసా సంపాదించి అమెరికాలో నాలుగు డాలర్లు వెనకేసుకుందాం అని కోటి ఆశలతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది మధ్యతరగతి యువత అమెరికాకు వెళుతుంటారు. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత చేస్తున్న కొన్ని పనులు వారి ఉపాధి అవకాశాలను పోగొడుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో డొనేషన్స్ స్కాంలో పాల్గొన్న దాదాపు 100 మందిని ఆపిల్ తొలగించిన తర్వాత ప్రస్తుతం మరో కంపెనీ భారీగా ఉద్యోగులను పీకేసింది.

వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన ఫెన్నీ మే సంస్థ దాదాపు 700 మంది ఉద్యోగులను తొలగించింది. నైతిక విలువలు పాటించని కారణంగా వీరిని ఉద్యోగం నుంచి తొలగించినట్లు కంపెనీ ప్రకటించింది. అయితే వీరిలో దాదాపు 200 మంది రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఉన్నట్లు వెల్లడైంది. వార్తా కథనాల ప్రకారం కొందరు కంపెనీ రీస్ట్రక్చరింగ్ కింద ఉద్యోగాలను కోల్పోయినట్లు తెలుస్తోంది. అయితే ప్రధానంగా తెలుగు ఉద్యోగులు మాత్రం నైతిక కారణాలతో లేఆఫ్ కి గురయ్యారు.

►ALSO READ | US Vs China: చైనాను చావుదెబ్బ కొట్టిన ట్రంప్.. ఇకపై 245 శాతం టారిఫ్స్, ఆ తప్పే కారణం..

కంపెనీ అందించే మ్యాచింగ్ గ్రాండ్ విధానాన్ని దుర్వినియోగం చేశారని, అమెరికాలోని తెలుగు సంఘం తానాలోని వ్యక్తులతో కుమ్మక్కై కంపెనీ నిధులను పక్కదారి పట్టించారని ఫెన్నీ మే పేర్కొంది. అయితే కేవలం తానా ఒక్క సంస్థ మాత్రమే ఈ స్కాంలో లేదని మరికొన్ని ఇతర సంస్థలు కూడా పాలుపంచుకున్నాయని వెల్లడైంది. ఇదే తరహ చారిటీ పేరుతో మ్యాచింగ్ గ్రాంట్స్ దుర్వినియోగ పరిచిన కారణంతో ఆపిల్ సంస్థ జనవరి 2025లో దాదాపు 100 మంది ఉద్యోగులను ఇళ్లకు పంపించేసింది. 

దీనికి ముందు డిసెంబర్ 2024లో ఆపిల్ సంస్థ ఆరుగురు మాజీ విదేశీ ఉద్యోగులు వేల డాలర్ల మేర పిల్లల చారిటీకి సహాయం పేరుతో కంపెనీ డబ్బును స్వాహా చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వారు కంపెనీ నుంచి లక్ష 52వేల డాలర్లను అందుకోగా వాటిలో లక్ష డాలర్ల వరకు అధికంగా చూపారని వెల్లడైంది.