న్యూఢిల్లీ : తాజాగా చేసిన ఆరోపణలపై సెబీ చైర్‌పర్సన్ మాధవి పురి బచ్ ఎందుకు మాట్లాడటం లేదని యూఎస్ కంపెనీ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ప్రశ్నించింది. అదానీ గ్రూప్ కంపెనీల్లో ఆమెకు ఇన్వెస్ట్‌మెంట్లు ఉండడం వల్లనే ఈ గ్రూప్‌పై దర్యాప్తు నెమ్మదిగా సాగిస్తున్నారని కిందటి నెలలో హిండెన్‌బర్గ్ ఆరోపించింది. సెబీ బోర్డ్‌లో మెంబర్‌గా ఉంటూనే కొన్ని కంపెనీల నుంచి పేమెంట్స్ అందుకున్నారని పేర్కొంది.
ఈ ఆరోపణలను ఇప్పటికే మాధవి అదానీ గ్రూప్ ఖండించినప్పటికీ, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ మాత్రం ఆమెకు అడ్వైజరీ కంపెనీలో 99 శాతం వాటా ఉందని, ఆమె భర్త ధవళ్ బచ్ నేతృత్వంలో నడుస్తున్న ఈ కంపెనీల నుంచి ఆదాయం పొందుతున్నారని ఆరోపిస్తోంది.
ఆమె ప్రైవేట్ కన్సల్టింగ్ కంపెనీ ఐసీఐసీఐ బ్యాంక్, డా.రెడ్డీస్, ఫిడిలిటీ, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి లిస్టెడ్ కంపెనీల నుంచి పేమెంట్స్ అందుకుందని హిండెన్‌బర్గ్ ఎక్స్‌లో పేర్కొంది. ఈ ఆరోపణలపై బచ్ స్పందించడం లేదని తెలిపింది.