
గ్రేటర్ వరంగల్, వెలుగు: భారత్, అమెరికా మధ్య వ్యాపార సంబంధాల అభివృద్ధికి కృషి చేస్తానని అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్లార్సన్పేర్కొన్నారు. శుక్రవారం వరంగల్చాంబర్ ఆఫ్ కామర్స్ఇండస్ర్టీ ఆధ్వర్యంలో ఆమె సన్మానించారు. అనంతరం ఎంకే నాయుడు హోటల్కన్వెషన్హాల్లో జరిగిన సదస్సులో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో పోటీ వ్యాపారం జరుగుతుందన్నారు.
రెండు దేశాల మధ్య క్వాలిటీ ఉత్పత్తులను ఎగుమతి, దిగుమతి చేసుకునేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. రాష్ర్టంలో మౌలిక సదుపాయాల కల్పన, రవాణతో పాటు ఇతర రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. ఎయిర్ పోర్ట్, హోటల్స్ అతిథ్య రంగాల్లో ఎంతో డెవలప్ అయిందన్నారు. అమెరికా వ్యాపారులతో వ్యూహాత్మక భాగస్వామ్యం నెలకొల్పుకుని విస్తరించుకునేందుకు ఎంతో అవకాశం ఉందన్నారు.
కార్యక్రమంలో చాంబర్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్ రెడ్డి, వేద ప్రకాశ్, చక్రధర్, పెంటయ్య, ఎంజీఎం సూపరిండెంటెంట్, కేఎంసీ ప్రిన్సిపాల్, ఇండియన్మెడికల్ అసోసియేషన్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. సదస్సు అనంతరం ఆమె వరంగల్ఖిలాను సందర్శించారు. ఎంతో చరిత్ర కలిగిన కోటలోని శిల్పాలు చాలా అద్భుతంగా ఉన్నాయన్నారు. ఏకశిల, రాతి కోట, కాకతీయుల కళా తోరణాలను చూశారు.